Posts

Showing posts from December, 2016

మారుతి సబ్జెక్ట్ కన్నడలోనూ సూపర్ హిట్ !

Image
మారుతి సబ్జెక్ట్ కన్నడలోనూ సూపర్ హిట్ ! యూత్ పల్స్ ను క్యాచ్ చేసి సినిమాలు తీయడంలో మాస్టర్ అనిపించుకున్న దర్శకుడు మారుతి తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రానికి కన్నడ రీమేక్ గా తెరకెక్కిన ‘సుందరంగ జాన’ డిసెంబర్ 23న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తన సబ్జెక్టు కన్నడలోనూ విజయం సాధించినందుకు హ్యాపీగా ఫీలైన మారుతి తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ‘భలే భలే మగాడివోయ్ కన్నడ రీమేక్ సుందరంగ జాన మంచి సక్సెస్ సాధించింది. చాలా సంతోషంగా ఉంది. మంచి సబ్జెక్ట్ ఏ భాషలో అయినా సక్సెస్ సాదిస్తుంది’ అన్నారు. అలాగే ‘ప్రేమ కథా చిత్రం కూడా తమిళ, కన్నడల్లో పెద్ద విజయం సాధించింది. ఇలాంటి విజయాలు భిన్నమైన కథలు రాయడానికి కావలసిన బలాన్నిస్తాయి’ అన్నారు. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ రీమేక్ చిత్రాన్ని రమేష్ అరవింద్ డైరెక్ట్ చేయగా గణేష్, శాన్వి హీరో హీరోయిన్లుగా నటించారు.

కబాలి 2లో మరో కొత్త లుక్ లో రజనీ

Image
కబాలి 2లో మరో కొత్త లుక్ లో రజనీ సూపర్ రజనీకాంత్ హీరోగా ఘనవిజయం సాధించిన సినిమా కబాలి. ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేసే రజనీ తొలిసారిగా ఓ కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా రజనీ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అందుకే కబాలి ఫీవర్ నడుస్తుండగానే ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టుగా సమాచారం. మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమాకు సీక్వల్ చేస్తున్నాడు రజనీ. ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 పనుల్లో బిజీగా ఉన్న రజనీ కబాలి సీక్వల్ పని కూడా మొదలెట్టేశాడు. ఇటీవల రజనీని కలిసిన దర్శకుడు పా రంజిత్, సీక్వల్ లో రజనీ లుక్, కాస్ట్యూమ్స్ పై చర్చించాడు. త్వరలోనే కబాలీ 2 సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది.

అభిమానం కలవరపరిచింది

Image
అభిమానం కలవరపరిచింది   మకిష్టమైన నటీనటులను చూడాలని, వారి ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. కానీ ఈ అభిమానం హద్దులు దాటితే?.. ఫ్యాన్స్‌ తమను తాము ఇష్టపడేదానికన్నా ఎక్కువగా నటీనటులను ఇష్టపడితే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. తాజాగా ఇలాంటి అనుభవమే ‘రన్‌ రాజా రన్‌’, ‘కొలంబస్‌’, ‘టైగర్‌’ చిత్రాల్లో నటించిన నటి సీరత్‌ కపూర్‌కు ఎదురైంది. ఓ అభిమాని ఆమెపై ఉన్న ప్రేమను తెలుపుతూ.. తన చేయిపై ‘ఎస్‌’ ఆకారంలో గాటు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలుపుతూ.. ఫొటోను పంపాడు. దీన్ని చూసిన తర్వాత తనకు మాటలు రాలేదని సీరత్‌ ఆవేదన చెందారు. తన ట్విట్టర్‌లో ‘ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అని ఒక పోస్ట్‌ చేశారు. జీవితం చాలా విలువైనది.. అలాగే మీరు కూడా. ఎవరి కోసమో మీకు మీరు హాని చేసుకోవద్దు.. అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. దీనిని రకుల్‌ రీట్వీట్‌ చేస్తూ ఇది చాలా కలవరపరిచే విషయమని పేర్కొన్నారు.

న్యూఇయర్‌ రోజున ‘విరుష్క’ ఎంగేజ్‌మెంట్‌!

Image
న్యూఇయర్‌ రోజున ‘విరుష్క’ ఎంగేజ్‌మెంట్‌! ఎన్నో ఏళ్లుగా ప్రేమ సాగరంలో మునిగితేలుతున్న స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ హీరోయిన్‌ అనుష్కాశర్మలు ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే తమ ప్రేమను బహిర్గతం చేసిన ఈ ప్రేమపక్షులు తమ బంధాన్ని మరో మెట్టు పైకి ఎక్కించాలనుకుంటునట్టు సమాచారం. అందుకే కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌లు మార్చుకుంటున్నారట. వీరి నిశ్చితార్థం న్యూ ఇయర్‌ రోజైన జనవరి 1న ఉత్తరాఖండ్‌లో జరుగబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి ఓ హోటల్‌లో తమ ఎంగేజ్‌మెంట్‌ను వైభవంగా చేసుకోబోతున్నారట. ఈ కార్యక్రమానికి అమితాబ్‌ ఫ్యామిలీతో బాటు అంబాని, కపూర్‌ కుటుంబాలు కూడా హాజరుకాబోతున్నట్టు సమాచారం. అలాగే ఇతర బాలీవుడ్‌ ప్రముఖులు, స్టార్‌ క్రికెటర్లు కూడా ఉత్తరాఖండ్‌కు పయనమవబోతున్నారట. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరూ అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఒకే సినిమాలో ముగ్గురు అందాల భామలు.!

Image
ఒకే సినిమాలో ముగ్గురు అందాల భామలు.!  గుంటూరు టాకీస్ సినిమా అందరికి సుపరిచితమే.. ఈ సినిమాలో నటి రష్మీ అందాల ఆరబోతకు థియేటర్లవైపు జనాలు క్యూ కట్టారు. ఫస్ట్ పార్ట్ కమర్సియల్‌‌గా సక్సెస్ కావడంతో ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ సీక్వెల్‌‌ తీసేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమాకు గుంటూరు టాకీస్-2 అని ఫిక్సయ్యారట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్న ఈ మూవీ షూటింగ్ మొత్తం ముంబాయిలో  జరగనుందని సమాచారం. ఈ సినిమాలో గిరి పాత్ర చేసిన నరేష్ నటనకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌లో కూడా ఆయనే నటిస్తున్నారని తెలిసింది.   గుంటూరు టాకీస్-2 సినిమా విషయానికొస్తే..  ఈ చిత్రంలో రష్మీకి అవకాశం లేదట. ఈ చిత్రంలో ముగ్గురు అందాల భామలు అందాలు ఆరబోయనున్నారనే టాక్ నడుస్తోంది. అయితే వారిలో బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ మెయిన్ రోల్‌‌లో కనిపించనుందట. అయితే ఈ చిత్రంలో సన్నీలియోన్‌ ఒక డాన్‌ క్యారెక్టర్‌లో కనపడనున్నారట. ఒక్క సన్నీలియోన్‌ పాత్రనే సుమారు 20రోజుల పాటు చిత్రిం చనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు సన్నీలియోన్‌ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది కానీ దక్షిణాదిన ఆమె ఫుల్‌ లెంల్త్ ...

అంటార్కిటికాలో హిట్లర్‌ రహస్య స్థావరం.

Image
అంటార్కిటికాలో హిట్లర్‌ రహస్య స్థావరం. అంటార్కిటికాలో విల్కీస్‌ ల్యాండ్‌ అనే ధట్టమైన మంచుతో కప్పపడిన ద్వీపంలో నాజీల ‘యూఎఫ్‌వో రహస్య స్థావరం’ ఉందని కొందరు పరిశోధకులు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాధించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్ అంటార్కిటికాలో యూఎఫ్‌వో (ఎగిరే పళ్లాలు)ల కోసం ఓ రహస్య స్థావరాన్ని నిర్మింప చేశాడని యూఎఫ్‌వో హంటర్లు పేర్కొంటున్నారు. దీని సంబంధించిన వివరాలను ‘సెక్యూర్‌టీం10’ బృందం తమ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియోలో తెలిపారు. ‘‘అంటార్కిటికాలోని మంచు కింద ఏముందో ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. ఈ రహస్యం ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. అయితే, ఇటీవల అక్కడ కొన్ని మానవ నిర్మాణాల ఆనవాళ్లు కనిపించాయి. మంచు పర్వతాల పక్కన అక్కడక్కడ కొన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల రంధ్రాలు ‘ఎగిరే పళ్లెం’ ఆకారంలో ఉన్నాయి. వీటి గుండా వెళ్లాలంటే ఏదైనా ఎగిరే వస్తువుతోనే సాధ్యం. అది కూడా ఆ రంధ్రం ఆకారాంలోనే ఉండాలి’’ అని వారు వివరించారు. అయితే, ఈ రహస్య మార్గల గురించి అమెరికా నావికా దళం ‘మిషన్‌ హై జంప్‌’ పేరుతో రహస్యంగా పరిశోధనలు చేస్తోందని చెబుతున్నారు. అంటార...

రివ్యూ.. దంగల్‌

Image
రివ్యూ..  దంగల్‌   ఆమిర్‌ఖాన్‌ అంటేనే విలక్షణ నటుడన్న పేరుంది. చేసే ప్రతీ సినిమాలోనూ తను ఆ ప్రత్యేకతను చాటుకుంటారు. అందుకే ఆయన సినిమా వస్తోందంటే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 2014లో ఆమిర్‌ నటించిన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. గ్రహాంతర వాసిగా ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. తాజాగా ప్రముఖ భారతీయ మల్లయోధుడు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్‌సింగ్‌ ఫోగట్‌ జీవిత కథతో తెరకెక్కిన ‘దంగల్‌’ చిత్రంలో నటించారు ఆమిర్‌ఖాన్‌. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో అడుగుపెట్టింది. మరి రెండేళ్ల విరామం తర్వాత వెండితెరపై ప్రత్యక్షమైన ఆమిర్‌.. సినీ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకున్నారో చూద్దాం.. కథేంటి?:  కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన మహిళా రెజ్లర్లు గీతా ఫోగట్‌.. బబితా కుమారీల విజయ ప్రస్థానమే ప్రధానాంశంగా సాగే చిత్రం ఇది. మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌(ఆమిర్‌ఖాన్‌) హరియాణాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మల్లయోధుడు. రెజ్లింగ్‌లో భారత దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నది ఆయన కల. కాన...

అశ్విన్‌పై ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం

Image
అశ్విన్‌పై ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం   ఉత్తమ బౌలర్‌గా తనదైన ముద్ర వేసుకున్న అశ్విన్‌.. అటు బ్యాటింగ్‌లోనూ సత్తాచాటుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఏడాది ఐసీసీ మేటి క్రికెటర్‌, ఐసీసీ మేటి టెస్ట్‌ క్రికెటర్‌ అవార్డులు వరించాయి. అవార్డు అందుకున్న అశ్విన్‌కు ఓ వైపు అభినందనలు వెల్లువెత్తగా.. అదే సమయంలో ధోని అభిమానుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతగా అశ్విన్‌ ఏం చేశాడనేగా అనుమానం? అవార్డు దక్కిన సంతోషంలో ధోని పేరును ప్రస్తావించకపోవడమే అశ్విన్‌ చేసిన నేరమట. ఐసీసీ అవార్డులు గెలుచుకున్న సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు ఈ యువ క్రికెటర్‌. ఈ సందర్భంగా తన భార్య ప్రీతి నారాయణ, కోచ్‌ అనిల్‌కుంబ్లే, టెస్ట్‌కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వాళ్ల తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించాడు. అయితే ఈ ట్వీట్‌ ధోని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై సోషల్‌మీడియాలో తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 2011లో ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే అశ్విన్‌ టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. అంతేకాక ఇద్దరూ ఒకే ఐపీఎల్‌(రైజింగ్‌ పుణె) జట్టులో ఆడుతున్నారు. అంతకుముందు వీరిద్దరూ చెన్నై సూపర్‌కింగ్స్‌ తరప...

ఐ హేట్‌ ఆమిర్‌..! సల్మాన్‌ఖాన్‌

Image
నీ సినిమానే బాగుంది.. అందుకే ద్వేషిస్తున్నా! రెజ్లింగ్‌ నేపథ్యంతో సినిమాలు తీసున్నామని, అవి 2016లో విడుదల చేస్తామని ఆమిర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ప్రకటించినప్పుడు ఒకింత ఆసక్తితోపాటు ఆశ్చర్యపరిచింది. సల్మాన్‌ ’సుల్తాన్‌’, ఆమిర్‌ ’దంగల్‌’  చిత్రాల్లో ఎవరి సినిమా విజేతగా నిలుస్తుందన్న చర్చ జరిగింది. సల్మాన్‌ ’సుల్తాన్‌’ మొదట విడుదలైంది. భారీ కలెక్షన్లతో ఊహించినట్టుగానే ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ సుల్తాన్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి ఉత్థానపతనాలు ఇతివృతంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథ పూర్తిగా కల్పితం. కానీ ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ’దంగల్‌’  సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్ఫూర్తిదాయకంగా మలిచిన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రివ్యూలు రావడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ ఏడాది వచ్చిన సుల్తాన్, దంగల్‌ సినిమాల్లో ఏది అత్యుత్తమ సినిమా అన్న చర్చ అభిమానుల్లో నడుస్తోంది. ఈ చర్చపై ఏకంగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ స్పందించాడు. తన సుల్తాన్‌ సినిమా కన్నా దంగల్‌ ఎంతో బాగుందని కితాబిచ్చాడు. ఆమిర్‌ వ్యక్తిగతం ప్రేమించినా....

ఫోర్బ్స్ లిస్టులో మన స్టార్ హీరోల ర్యాంకింగ్స్ !

Image
ఫోర్బ్స్ లిస్టులో మన స్టార్ హీరోల ర్యాంకింగ్స్ ! ప్రముఖ ఫోర్బ్స్ జాబితా ప్రతి సంవత్సరం ప్రకటించే ఫోర్బ్స్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ తాజాగా విడుదలైంది. దేశంలోని సినిమా, క్రీడా, టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ లిస్టులో ఉన్నారు. అలాగే టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు 33వ స్థానంలో ఉండగా తరువాత అల్లు అర్జున్ 43వ స్థానం ఆ తరువాత ఎన్టీఆర్ 55, రామ్ చరణ్ 67 వ స్థానాల్లో ఉన్నారు. ఈ స్టార్ హీరోలంతా ఈ సంవత్సరం ఒక్కో సినిమాతో సందడి చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇకపోతే హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ 37వ స్థానంలో ఉంది. ఇకపోతే టాప్ లిస్టులో బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ , షారుక్ ఖాన్ లు 2, 3 స్థానాల్లో ఉండగా క్రికెటర్ విరాట్ కోహ్లీ 1వ స్థానంలో ఉన్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 53వ స్థానంలో ఉండగా కమల్ హాసన్ 78వ స్థానం ఉన్నారు.

రివ్యూ.. వంగవీటి – వర్మ చెప్పిన వంగవీటి కథ

Image
రివ్యూ..  వంగవీటి – వర్మ చెప్పిన వంగవీటి కథ ఈ వారాంతపు విడుదలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వంగవీటి’. 80, 90వ దశకాలలో విజయవాడలో నడిచిన రౌడీయిజం నైపథ్యంలో జరిగిన వాస్తవ ఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సందీప్ కుమార్, వంశీ కృష్ణలు ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. కథ : విజయవాడలో బాగా పాపులర్ అయిన వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య నడిచే శత్రుత్వం పై నడిచే కథే ఈ వంగవీటి. విజయవాడ నగరంలో చిన్న రౌడీగా మొదలైన వంగవీటి రాధ (సందీప్ కుమార్) అనూహ్య రీతిలో ఎదుగుతుంటాడు. దాంతో అతని ప్రత్యర్థి వర్గమైన దేవినేని కుటుంబం అతన్ని హతమారుస్తుంది. ఆ హత్య తరువాత ఈ రెండు కుటుంబాల సభ్యులు పగతో ఒకరినొకరు ఎలా చంపుకున్నారు, చివరికి ఆ పగ ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్ : సినిమాలోని ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రధాన పాత్రలు పోషించిన నటుడు సందీప్ కుమార్ గురించి. రంగ, రాధ పాత్రల్లో సందీప్ చాలా బాగా నటించాడు. భవిష్యత్తులో అతను గొప్ప నటుడవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతన్ని అంత గొప్పగా చూపించి, అతని పాత...

రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్

Image
రివ్యూ.. : సప్తగిరి ఎక్స్ ప్రెస్ – కాస్త కామెడీ, కాస్త ఎమోషన్  డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అనుకోకుండా నటనలోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు సప్తగిరి ఇంకో అడుగు ముందుకేస్తూ హీరోగా చేసిన చిత్రమే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.. కథ : కానిస్టేబుల్ కొడుకైన సప్తగిరి (సప్తగిరి) తండ్రి మాటలు వినకుండా సినిమాల్లో వెళ్లాలని, పెద్ద నటుడవ్వాలని కలలుగంటూ అల్లరిగా తిరుగుతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోకుండా పెద్ద కష్టం ఎదురై సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టి పోలీస్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. అలా పోలీస్ డ్రెస్ వేసుకున్న సప్తగిరి ఆ ఉద్యోగంలో నానా కష్టాలు పడుతూ తన కుటుంబానికొచ్చిన కష్టానికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళను అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అసలు సప్తగిరి కుటుంబానికి వచ్చిన ఆ కష్టం ఏమిటి ? ఆ కష్టానికి కారణం ఎవరు ? సప్తగిరి వాళ్ళను ఎలా అంతం చేశాడు ? అన్నదే ఈ సినిమా కథ. ఓవర్ యక్షన్ చేయించకుండా: మాంచి మాస్ కథని ...

శుక్రవారం ‘వంగవీటి’ చిత్రం విడుదల... అధికార పార్టీకి ముచ్చెమటలు?

Image
శుక్రవారం ‘వంగవీటి’ చిత్రం విడుదల... అధికార పార్టీకి ముచ్చెమటలు?                     విజయవాడ మాజీ ఎం.ఎల్.ఏ., కాపు ఉద్యమ నాయకుడు వంగవీటి మోహనరంగ జీవితాన్ని ఆధారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ చిత్రం ఎలా ఉంటుందోననే అంశంపై తీవ్ర చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. 1980వ దశకంలో విజయవాడలో చోటుచేసుకున్న వర్గ పోరాటాలు, కుల పోరాటాల నేపథ్యంతో ముడిపడిన కథ వంగవీటి.  వంగవీటి-దేవినేని కుటుంబాల మధ్య వర్గపోరుగా ప్రారంభమైన గొడవలు కాస్తా ఆ తదుపరి రెండు సామాజిక వర్గాల పోరుగా మారిన సంగతి విదితిమే. ఈ చిత్రంలో వర్మ వంగవీటి కుటుంబం వైపుకు మొగ్గు చూపుతారా.. లేక దేవినేని కుటుంబంపై మొగ్గు చూపుతారా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇరు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సినిమాను రూపొందించడం జరిగిందని వర్మ ఇప్పటికే ప్రకటించారు. కానీ చిత్ర టైటిల్ వంగవీటి అని పెట్టడం.. వాస్తవమైన పేర్లను సినిమాలోని పాత్రలకు పెట్టడంతో కత్తి మీద సాము లాంటి ఈ పనిని వర్మ ఎలా సెల్యూలాయిడ్ పై చిత్రిం...

‘వంగవీటి’ నా చివరి సినిమా.. రెండోసారి ప్రకటించిన వర్మ

Image
‘వంగవీటి’ నా చివరి సినిమా.. రెండోసారి  ప్రకటించిన వర్మ ‘వంగవీటి’ తన చివరి సినిమా అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ రెండోసారి ప్రకటించారు. విజయవాడ రౌడీయీజం బ్యాక్ డ్రాప్‌లో తీసిన వంగవీటిపై మొత్తం టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వంగవీటికి ఆర్జీవీ ప్రమోషన్ ఇస్తున్నారు. వర్మ సినిమాలో ఈ మధ్య కాలంలో లేనన్ని వివాదాల్ని వంగవీటి సృష్టించింది. ఈ చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందా? ‘వంగవీటి’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ‘సినిమాల గురించి తక్కువగా..వివాదాల గురించి ఎక్కువగా’ మాట్లాడే వర్మ వంగవీటి తన కేరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అంటూ తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. శివ సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసిన ఆర్జీవీ మరోసారి అలాంటి సక్సెస్ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు విజయవాడ రౌడీయీజం రాజకీయం బ్యాక్ డ్రాప్‌లో వస్తున్నవే. మాఫియా, రౌడీయీజాన్ని కొత్తగా చూపించడంలో వర్మకు టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ ప్రత్యామ్నాయం లేదు. 1970లో బెజవాడలో ఊపేసిన రౌడీయీజం, హత్యలు, రాజకీయాలు అనంతర పరిణామాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.   1970లో జరిగిన చలసాని వెంకటర...

చిరుపై బాలయ్యదే పైచెయ్యా?

Image
చిరుపై బాలయ్యదే పైచెయ్యా? సంక్రాంతికి నువ్వా-నేనా అన్నట్టుగా రెండు పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఆ సినిమాలేవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో. అవే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150, బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఇద్దరికీ ఆ సినిమాలు ప్రతిష్ఠాత్మకమే. మెగాస్టార్ చిరంజీవి దశాబ్ద కాలం గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా కావడం, అదీ 150వ చిత్రం కావడంతో దానిపై అంచనాలు తారస్థాయినే తాకాయి. ఇటు బాలయ్య వందో చిత్రం కావడంతో దానిపైనా అంచానాలు మిన్నగానే ఉన్నాయి. కానీ, బాలయ్యపై చిరంజీవే ఓ మెట్టు ఎక్కువున్నాడు. అయితే.. ఆ పరిస్థితి తర్వాత తారుమారైందట. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చారిత్రక కథాంశం కావడంతో ఆ సినిమాకు అంత సీన్ లేదు అనుకున్నారట ఫిల్మ్‌నగర్‌లో. దీంతో అందరి చూపు ఖైదీ నంబర్ 150పైనే పడిందంటున్నారు. ఇప్పుడు శాతకర్ణి సినిమా ట్రైలర్లు, దానిని తెరకెక్కించిన విధానంతో మెగా కాంపౌండ్‌ను వెనక్కు నెట్టేశాడట శాతకర్ణి. మొన్నటిదాకా టాలీవుడ్‌లో నాలుగు, ఐదో స్థానంలో ఉన్న శాతకర్ణి ట్రైలర్ ఇప్పుడు మొదటి స్థానంలోకి రావడంతో.. మెగా హీరోల రేటింగ్ పడిపోయిందా? అని చర్చించుకుంటున్న...

తారక్, బన్నీలను కలిపిన డైరెక్టర్!

Image
తారక్, బన్నీలను కలిపిన డైరెక్టర్! ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నా  ఒక్క కుటుంబంలోని వారే చేస్తున్నారు. వెంకటేశ్-మహేశ్ బాబు, పవన్ కల్యాణ్-వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలే రెండు వేర్వేరు కుటుంబాల హీరోలు చేసిన సినిమాలు. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా వచ్చింది. ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల గురించి మాట్లాడినా.. ఒక్క కుటుంబంలోని హీరోల గురించే ప్రస్తావన వస్తోంది. హీరోలంతా తాము మల్టీస్టారర్ సినిమాల్లో చేసేందుకు రెడీ అంటున్నా.. ఆ దిశగా అడుగులు అయితే పడడం లేదు. తాజాగా ఆ దిశగా అడుగులు పడినట్టు చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. ఆ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడని చెప్పుకొంటున్నారు. అయితే.. వాళ్లిద్దరూ పూర్తి హీరోలుగా మాత్రం నటించరట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తీస్తున్న సినిమాలో వాళ్లిద్దరూ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆ అతిథి పాత్రల కోసం వారిద్దరినీ కలపాలని బోయపాటి యోచిస్తున్నాడట. అందుకు తగ్గట్టు స్క్...

ప్రభాస్ కోసం బాలీవుడ్ సంగీత త్రయం..?

Image
ప్రభాస్ కోసం బాలీవుడ్ సంగీత త్రయం..? బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగా ఓ యాక్షన్ కథను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం జాతీయ స్థాయి టెక్నికల్ టీంను సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకులుగా బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ లను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మ్యూజీషియన్స్ గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే తెలుగు సినిమాకు సంగీతం అందించారు. అయితే ప్రభాస్ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా భారీగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న చిత్రయూనిట్, బాలీవుడ్ టెక్నిషియన్స్ అయితేనే కరెక్ట్ అని భావిస్తోంది. త్వరలో ఈ చిత్ర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే

Image
పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే 'కాట‌మ‌రాయుడు' సినిమా త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాలో న‌టించ‌నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'దేవుడే దిగి వ‌చ్చినా' అనే టైటిల్ సైతం ప్రచారంలో ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పుడో హాట్ న్యూస్ చెప్పబోతున్నాం. మీరు విని ఆశ్చర్యపోయే న్యూస్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఆ అనుబంధంతో వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఇక అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా చేసిన బొమన్ ఇరానీ నిసైతం ఈ సినిమా కోసం తీసుకున్నారు. కుష్బు మరో కీ రోల్ లో కనిపించనుంది. జనవరి 2017 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా చేయనున్నారు. 

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ... ఇదిగో వివరాలు!

Image
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ... ఇదిగో వివరాలు! యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడితో సినిమా చేయాలని ఎన్టీఆర్ కూడా ఇంట్రుస్టు చూపుతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. అప్ప‌టికే త్రివిక్ర‌మ్ కళ్యాణ్ తో మూవీ కమిట్ కావడంతో ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. ఈ గ్యాపులో ఎన్టీఆర్ బాబీతో సినిమాకే చెప్పాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరూ సినిమా గురించి ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ప‌వ‌న్ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్. పవన్-త్రివిక్రమ్ మూవీ పూర్తయ్యేలోపు ఎన్టీఆర్-బాబు సినిమా పూర్తి కానుంది. ఇద్దరూ తమ తమ ప్రాజెక్టుల నుండి ఫ్రీ అయ్యాక..... సినిమా మొదలు పెట్టనున్నారు. ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందే భారీ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ...

చైతన్య నా పక్కన కూర్చొని ఏడ్చాడు

Image
చైతన్య నా పక్కన కూర్చొని ఏడ్చాడు అందం, అభినయంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కథానాయిక సమంత. ఇవాళ సాయంత్రం ఆమె అభిమానులతో ఫేస్‌బుక్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘తెరి’ చిత్రంలో అందర్నీ ఏడిపించారు? అని ప్రశ్నించారు. దీనికి సమంత వెంటనే నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘ఈ సన్నివేశం చేసే ముందు దర్శకుడు అట్లీ సీన్‌ చెప్పారు. అట్లీ.. థియేటర్లో అందరూ ఏడ్చేలా నా ప్రయత్నం చేస్తానని చెప్పా. అది నిజంగా జరగడం విజయంగా భావిస్తున్నా. ఆ చిత్రంలో నేను చనిపోతాను. ఈ సినిమాకు నా స్నేహితులతో కలిసి వెళ్లా. నేను చనిపోయే సన్నివేశం వస్తున్నప్పుడు.. స్క్రీన్‌వైపు చూడకుండా థియేటర్లో చుట్టుపక్కల అందర్నీ చూస్తూ కుర్చొన్నా. చైతన్య నా పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. ఆ సన్నివేశం చేసే ముందు అట్లీతో చాలా మాట్లాడాను. అందర్నీ ఏడిపించాలనుకున్నా.. ఏడిపించా’ అని నవ్వుతూ చెప్పారు. 

రాజమౌళి మహాభారతంలో... శ్రీకృష్ణుడిగా అమీర్‌ఖాన్!

Image
రాజమౌళి మహాభారతంలో... శ్రీకృష్ణుడిగా  అమీర్‌ఖాన్! బాహుబలి చిత్రంతో రాజమౌళి ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు. నిత్యం విభిన్న పాత్రలతో సినిమాలు చేస్తూ అమీర్‌ఖాన్ విశ్వవ్యాప్తం అయ్యాడు. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే! వస్తే కాదు.. వస్తుంది అని కూడా గతంలో పుకార్లు పుట్టాయి. వాటిని రాజమౌళి తిరస్కరించడం.. అమీర్‌తో తన సినిమాపై ఇప్పటినుంచే పబ్లిసిటీ ఎందుకు అనుకున్న రాజమౌళి కావాలనే అటువంటి పుకార్లను ఖండించి.. ఆ సినిమా కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే, తొలిసారిగా అమీర్‌ఖాన్ దీనిపై స్పందించాడు. రాజమౌళితో తాను సినిమా చేస్తాననే వార్తలు కేవలం పుకార్లేనని, బాహుబలి తర్వాత అతడిని ఒక్కసారే కలిశానని, అప్పుడు కూడా సినిమా గురించి ఏం మాట్లాడుకోలేదని స్పష్టం చేశాడు. అయితే, రాజమౌళి కలల సినిమా మహాభారతంలో అవకాశం వస్తే.. శ్రీకృష్ణుడి పాత్రను ఎంచుకుంటానని, వాస్తవానికి తనకు కర్ణుడి పాత్ర ఇంకా ఇష్టమని కానీ, కర్ణుడు ఆరడుగుల ఆజానుబాహుడు కాబట్టి తాను ఆ పాత్రకు సూటవనని చెప్పాడు అమీర్‌ఖాన్. అంతేకాదు, తెలుగు సినిమాల్లో నటించడంపై కూడా మాట్లాడిన అమీర్.. తనకు తెలుగులో చిరంజీవి గా...

చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!

Image
చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట! మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో మిగతా హీరోలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతర హీరోల సినిమాలు విజయవంతమైనపుడు ఫోన్‌ చేసి అభినందిస్తుంటాడు. ఇలా మహేష్‌, ఎన్టీయార్‌, అఖిల్‌, ప్రభాస్‌, రానాతో చరణ్‌కు మంచి స్నేహముంది. ఇలాంటి చరణ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలంటే చాలా అసూయట.     చాలా రోజుల తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ ‘ధృవ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. చరణ్‌కు యువహీరోలు శర్వానంద్‌, నానిలను చూస్తే చాలా అసూయట.   ‘శర్వానంద్‌, నాని కథలను ఎంపికచేసుకునే విధానం నాకు అసూయను కలుగచేస్తుంటుంది. ఆ విషయంలో వాళ్లను చూసి కొన్నిసార్లు జెలసీగా ఫీలవుతా. వాళ్లలాగానే నాకూ విభిన్నమైన కథల్లో నటించాలని ఉంటుంద’ని తన మనసులో మాట బయటపెట్టాడు

వెంకటేష్ కొత్త సినిమా ఆగిపోయిందా..?

Image
వెంకటేష్ కొత్త సినిమా ఆగిపోయిందా..? సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గురు. తమిళ, హిందీ భాషల్లో మంచి టాక్ సొంతం చేసుకున్న సాలాఖద్దూస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. గురు సినిమా రిలీజ్ కాక ముందే తన తరువాత సినమాను కూడా పట్టాలెక్కించేశాడు వెంకీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించకపోయినా..  పెద్ద నోట్ల రద్దు కారణంగా సినిమా షూటింగ్ ను ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు.

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

Image
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..? తెలుగు తెరపై మెరిసిన కుర్రకథానాయికల జాబితాలో అవికా గోర్ పేరు కూడా కనిపిస్తుంది. 'ఉయ్యాలా జంపాలా' .. 'సినిమా చూపిస్త మావ' వంటి హిట్స్ ఆమె ఖాతాలో వున్నాయి. ఆ తరువాత ఈ అమ్మాయి కొంత గ్యాప్ తీసుకుని అమెరికా వెళ్లింది. అక్కడ డైరెక్షన్లో డిప్లొమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అందరి మనసులను గెలుచుకుంది అవికా గోర్. ఆ బుల్లితెర క్రేజ్‌తోనే 'ఉయ్యాల జంపాల'తో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కొన్ని వరుస అవకాశాలు వచ్చినా వదులుకుంది. తదుపరి ఆమె చేసిన సినిమా 'సినిమా చూపిస్త మావ'. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పేరు తెచ్చుకుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... అవికా సినిమాలకి కొంత కాలం పాటు విరామం ఇవ్వాలనుకుంటోందట . తెలుగులో : అవికాగౌర్ చిన్నప్పటి నుంచి నటిస్తోంది. టీవీ సీరియళ్ల ద్వారా చాలా పాపులారిటీ సంపాదించింది. వృత్తి విషయంలో ఆమె చాలా డిసిప్లిన్డ్ గా వ్యవహరించేది. ఏనాడూ షూటింగ్ ఎగ్గొట్టడం కానీ, ఆలస్యంగా రావడం కానీ లేదు. త...