ఒకే సినిమాలో ముగ్గురు అందాల భామలు.!
ఒకే సినిమాలో ముగ్గురు అందాల భామలు.!
గుంటూరు టాకీస్ సినిమా అందరికి సుపరిచితమే.. ఈ సినిమాలో నటి రష్మీ అందాల ఆరబోతకు థియేటర్లవైపు జనాలు క్యూ కట్టారు. ఫస్ట్ పార్ట్ కమర్సియల్‌గా సక్సెస్ కావడంతో ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ సీక్వెల్ తీసేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమాకు గుంటూరు టాకీస్-2 అని ఫిక్సయ్యారట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్న ఈ మూవీ షూటింగ్ మొత్తం ముంబాయిలో జరగనుందని సమాచారం. ఈ సినిమాలో గిరి పాత్ర చేసిన నరేష్ నటనకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌లో కూడా ఆయనే నటిస్తున్నారని తెలిసింది.
గుంటూరు టాకీస్-2 సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో రష్మీకి అవకాశం లేదట. ఈ చిత్రంలో ముగ్గురు అందాల భామలు అందాలు ఆరబోయనున్నారనే టాక్ నడుస్తోంది. అయితే వారిలో బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ మెయిన్ రోల్‌లో కనిపించనుందట. అయితే ఈ చిత్రంలో సన్నీలియోన్ ఒక డాన్ క్యారెక్టర్‌లో కనపడనున్నారట. ఒక్క సన్నీలియోన్ పాత్రనే సుమారు 20రోజుల పాటు చిత్రిం చనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు సన్నీలియోన్ ఐటెమ్ సాంగ్ చేసింది కానీ దక్షిణాదిన ఆమె ఫుల్ లెంల్త్ రోల్ చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం.
ఇక మరో హీరోయిన్ నమిత విషయానికొస్తే.. నాజూకు తారగా ప్రయాణం మొదలుపెట్టి కుర్రకారు హృదయాలను దోచుకున్న అందాల నమిత కొంత కాలానికే భారీగా తయారయ్యి వ్యాంప్ పాత్రలకు షిఫ్ట్ అయిన ఈ భామ మళ్లీ యూటర్న్ తీసుకుంది. గతంలో సింహా సినిమాలో భారీ అందాలను ఆరబోసిన ఈ భామ మరోసారి గుంటూరు టాకీస్-2లో నటించేందుకు సిద్ధమవుతోందట.
నికిషా పటేల్ విషయానికొస్తే.. తెలుగులో నటించింది ఇప్పటి వరకు ఈ భామ నటించింది రెండు చిత్రాలే.. అవి కూడా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. అప్పుడెప్పుడో పవన్ పులి చిత్రంలో నటించిన ఈ భామ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోవడంతో కోలీవుడ్ కే పరిమితమైంది. చాలా గ్యాప్ తర్వాత అరకు రోడ్‌లో అనే సినిమాలో నటించింది. తాజాగా ఈ బ్యూటీ గుంటూరు టాకీస్-2 నటిస్తోందని టాక్ నడుస్తోంది. మరి క్యాస్టింగ్ ఇంత హాట్‌గా ఉంటే సినిమా ఏ రేంజ్‌లో హాట్‌గా సినిమా ఏ రేంజ్‌లో సెగలు పుట్టిస్తుందో ఏమో వేచి చూడాల్సిందే.!
Comments
Post a Comment