రాజమౌళి మహాభారతంలో... శ్రీకృష్ణుడిగా అమీర్‌ఖాన్!
రాజమౌళి మహాభారతంలో... శ్రీకృష్ణుడిగా
అమీర్‌ఖాన్!
బాహుబలి చిత్రంతో రాజమౌళి ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు. నిత్యం విభిన్న పాత్రలతో సినిమాలు చేస్తూ అమీర్‌ఖాన్ విశ్వవ్యాప్తం అయ్యాడు. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే! వస్తే కాదు.. వస్తుంది అని కూడా గతంలో పుకార్లు పుట్టాయి. వాటిని రాజమౌళి తిరస్కరించడం.. అమీర్‌తో తన సినిమాపై ఇప్పటినుంచే పబ్లిసిటీ ఎందుకు అనుకున్న రాజమౌళి కావాలనే అటువంటి పుకార్లను ఖండించి.. ఆ సినిమా కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే, తొలిసారిగా అమీర్‌ఖాన్ దీనిపై స్పందించాడు. రాజమౌళితో తాను సినిమా చేస్తాననే వార్తలు కేవలం పుకార్లేనని, బాహుబలి తర్వాత అతడిని ఒక్కసారే కలిశానని, అప్పుడు కూడా సినిమా గురించి ఏం మాట్లాడుకోలేదని స్పష్టం చేశాడు. అయితే, రాజమౌళి కలల సినిమా మహాభారతంలో అవకాశం వస్తే.. శ్రీకృష్ణుడి పాత్రను ఎంచుకుంటానని, వాస్తవానికి తనకు కర్ణుడి పాత్ర ఇంకా ఇష్టమని కానీ, కర్ణుడు ఆరడుగుల ఆజానుబాహుడు కాబట్టి తాను ఆ పాత్రకు సూటవనని చెప్పాడు అమీర్‌ఖాన్. అంతేకాదు, తెలుగు సినిమాల్లో నటించడంపై కూడా మాట్లాడిన అమీర్.. తనకు తెలుగులో చిరంజీవి గారితో కలిసి నటించాలని ఉందని, చిరు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఒకవేళ చిరంజీవితో కుదరకపోతే.. పవన్‌తో అయినా మల్టీ స్టారర్ చేయడానికి తాను సిద్ధమే అని వెల్లడించాడు. మరి, అమీర్ ఆశలపై అటు రాజమౌళి, ఇటు చిరు కాస్త కన్నేస్తే మంచిది అనిపిస్తుంది కదా!
Comments
Post a Comment