రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్

రివ్యూ..: సప్తగిరి ఎక్స్ ప్రెస్ – కాస్త కామెడీ, కాస్త ఎమోషన్ 


డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అనుకోకుండా నటనలోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు సప్తగిరి ఇంకో అడుగు ముందుకేస్తూ హీరోగా చేసిన చిత్రమే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
కథ :
కానిస్టేబుల్ కొడుకైన సప్తగిరి (సప్తగిరి) తండ్రి మాటలు వినకుండా సినిమాల్లో వెళ్లాలని, పెద్ద నటుడవ్వాలని కలలుగంటూ అల్లరిగా తిరుగుతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోకుండా పెద్ద కష్టం ఎదురై సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టి పోలీస్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది.
అలా పోలీస్ డ్రెస్ వేసుకున్న సప్తగిరి ఆ ఉద్యోగంలో నానా కష్టాలు పడుతూ తన కుటుంబానికొచ్చిన కష్టానికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళను అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అసలు సప్తగిరి కుటుంబానికి వచ్చిన ఆ కష్టం ఏమిటి ? ఆ కష్టానికి కారణం ఎవరు ? సప్తగిరి వాళ్ళను ఎలా అంతం చేశాడు ? అన్నదే ఈ సినిమా కథ.


ఓవర్ యక్షన్ చేయించకుండా:

మాంచి మాస్ కథని పూర్తిగా మార్చేసి కేవలం కామెడీకోసమే ఈ కథ అన్నట్టు చూపించటం లో దర్శకుడు సక్సెస్ అయినట్టే. అందులోనూ సప్తగిరి లాంటి హీరో ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందో అంతవరకే అతన్ని వాడుకున్నడు. పగా, ప్రతీకారం అనగానే కనిపించే భారీ ఫైట్లూ, పంచ్ డైలాగులూ లేకుందా మొత్తానికి సప్తగిరితో ఓవర్ యక్షన్ చేయించకుండా అతన్ని ఫ్రీగా వదిలేసాడు.

ఈ సినిమాకి హైలెట్ :

బ‌య‌ట సినిమాల్లో స‌ప్త‌గిరి ఎలా న‌వ్వించాడో, ఇక్క‌డా అలానే న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. పాట‌లు, ఫైటులు చేసినా అవీ కామెడీగానే సాగాయి. స‌ప్త‌గిరి న‌ట‌న‌పై పిచ్చి చూపించే సీన్లు, కాలేజీలో గోల్డు మెడ‌ల్ కోసం వేసిన వేషాలు న‌వ్విస్తాయి. త‌న న‌ట‌నా ప్ర‌తిభ చూపించ‌డానికి త‌ల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వేసిన ఏక పాత్రాభిన‌యం ఈ సినిమాకి హైలెట్ అయ్యింది. తండ్రి మ‌ర‌ణం.. దాన్నుంచి పుట్టుకొచ్చిన ఎమోష‌న్ ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కూ ద‌గ్గ‌ర చేస్తుంది.

పంచ్‌లు పేలాయి :


చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు నిర్మాత. అందుకే ప్రతీ సీన్‌ రిచ్‌గా కనిపిస్తుంది. ఓ మాస్‌ హీరోకి తగిన పాటలిచ్చాడు సంగీత దర్శకుడు. మాటలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి. కొన్ని పంచ్‌లు పేలాయి కూడా. ద్వితీయార్ధంలో రివేంజ్‌ డ్రామా విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కామెడీ, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయినా... రొటీన్ కథా సెకండాఫ్ సాగదీసినట్టుగా అనిపించటం లాంటి లోపాలూ ఉన్నాయి... రొటీన్ లో కామెడీ పోసి సర్వ్ చేసిన కాక్టెయిల్... హాస్యాన్ని ఇష్టపడేవాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ లో హీరో సప్తగిరి మీద నడిచే రెండు డైలాగ్ ఓరియెంటెడ్ సన్నివేశాల గురించి. సినిమా ఓపెనింగ్లో పురాణాల్లోని శ్రీరామ కళ్యాణ ఘట్టంలో వచ్చే పరశురాముడి వేషంలో సప్తగిరి చాలా బాగా నటించాడు. పరశురాముడి వేషధారణలో హావభావాలను ఆకర్షణీయంగా పలికించిన సప్తగిరి డైలాగులను నిరాటంకంగా చెప్పి మెప్పించాడు. అలాగే తండ్రి ముందు తన నటనా ప్రతిభను చూపేటప్పుడు చెప్పే దుర్యోధనుడి డైలాగ్ కూడా చాలా ప్రభావవంతంగా చెప్పి ఈలలు వేయించాడు.
ఇక ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కానిస్టేబుల్ కాణిపాకం(షకలక శంకర్) పై నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో కానిస్టేబుళ్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయి అనేది బాగా చూపారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సీక్వెన్స్ ఒకటి సెకండాఫ్ మొత్తానికి హైలెట్ గా నిలిచి బాగానే నవ్వించింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే చిన్నపాటి ట్విస్టులు కాస్త థ్రిల్లింగా అనిపించాయి. ఇక మొదటిసారి హీరోగా చేసిన సప్తగిరి కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో బాగా నటించి ఆకట్టుకున్నాడు.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ అంతా పూర్తయ్యాక కూడా సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం. దీంతో ఇంటర్వెల్ ముందువరకు సినిమాని బలవంతంగా నడిపించినట్టు అనిపించింది. ఫస్టాఫ్ మొత్తంలో సప్తగిరి డైలాగ్ సీన్స్ మినహాయిస్తే సప్తగిరికి అతని ఫ్రెండ్స్ పై నడిచే కొన్ని కామెడీ, అనవసరపు సన్నివేశాలు చికాకు పెట్టాయి. సినిమాలో హీరో పాత్ర సీరియస్ గా నటుడవ్వాలని ట్రై చేస్తుంటుందని చెప్తారు గాని హీరో పాత్రలో ఆ సీరియస్ నెస్ ఎక్కడా కనిపించదు.
ఇక ఫస్టాఫ్, సెకండాఫ్ లలో హీరో, హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ ఆకట్టుకోకపోగా బోర్ కొట్టించింది వదిలింది. హీరోయిన్ రోషిని ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎప్పుడెప్పుడు సీన్ పూర్తైపోతుందా అనిపించిది. ఇక సినిమాలో కీలకమైన కొన్ని నెగెటివ్ పాత్రల్ని చాలా బలహీనంగా చూపడంతో కథలోని సీరియస్ నెస్ చాలా వరకూ మిస్సయింది. హీరో సప్తగిరి తన కష్టానికి కారణమైన వారిపై పగ తీర్చుకునే సీన్లు కొన్ని మరీ విపరీతంగా అనిపించాయి. ఇక బోరింగ్ కథనం నడుస్తుండగా మధ్యలో వచ్చే పాటలు మరింత చిరాకు తెప్పించాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగానికొస్తే తమిళ సినిమా నుండి తీసుకున్న ఈ కథను మన నేటివిటీకి తగ్గట్టు మార్చుకున్న దర్శకుడు అరుణ్ పవార్, హీరో సప్తగిరిలు కథ, కథనాల్లో ఎక్కడా సీరియస్ నెస్ మైంటైన్ చేయలేకపోయారు. అసలు కథను సెకండాఫ్ లో మొదలుపెట్టేటప్పుడు ఫస్టాఫ్ ను పాత్రల నడవడిక, సరైన కామెడీ, రొమాన్స్ వంటి వాటితో నడపాల్సింది. ఆ ప్రయత్నంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇక బుల్గేనిన్ సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ సరిగా లేకపోవడంతో పాత్రల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ కలిగింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాత డా. రవి కిరణ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
స్టార్ కమెడియన్ సప్తగిరికి హీరోగా ఈ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ గొప్ప ఆరంభం కాదనే చెప్పాలి. ఫస్టాఫ్ లో వచ్చే రెండు డైలాగ్ సీన్లు, కొన్ని కామెడీ సీన్లు, సెకండాఫ్ లో షకలక శంకర్ పై నడిచే కామెడీ, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ లలో వచ్చే రెండు చిన్నపాటి థ్రిల్స్, కానిస్టేబుళ్ల కష్టాలను ఎలివేట్ చేయడం వంటివి ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా ఇంటర్వెల్ తరువాత గానీ అసలు కథ మొదలకపోవడం, బోర్ కొట్టించే ఫస్టాఫ్, కథలో సీరియస్ నెస్ పూర్తిగా మిస్సవడం, చిరాకు తెప్పించే అనవసరపు సీన్లు, ఏమాత్రం ప్రభావం చూపలేని హీరోయిన్ ట్రాక్ ఇందులో మైనస్ పాయింట్లుగా ఉన్నాయి.

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

కబాలి 2లో మరో కొత్త లుక్ లో రజనీ

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే