చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!
చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో మిగతా హీరోలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతర హీరోల సినిమాలు విజయవంతమైనపుడు ఫోన్ చేసి అభినందిస్తుంటాడు. ఇలా మహేష్, ఎన్టీయార్, అఖిల్, ప్రభాస్, రానాతో చరణ్‌కు మంచి స్నేహముంది. ఇలాంటి చరణ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలంటే చాలా అసూయట.
చాలా రోజుల తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ‘ధృవ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. చరణ్‌కు యువహీరోలు శర్వానంద్, నానిలను చూస్తే చాలా అసూయట.
‘శర్వానంద్, నాని కథలను ఎంపికచేసుకునే విధానం నాకు అసూయను కలుగచేస్తుంటుంది. ఆ విషయంలో వాళ్లను చూసి కొన్నిసార్లు జెలసీగా ఫీలవుతా. వాళ్లలాగానే నాకూ విభిన్నమైన కథల్లో నటించాలని ఉంటుంద’ని తన మనసులో మాట బయటపెట్టాడు
Comments
Post a Comment