చైతన్య నా పక్కన కూర్చొని ఏడ్చాడు

చైతన్య నా పక్కన కూర్చొని ఏడ్చాడు

అందం, అభినయంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కథానాయిక సమంత. ఇవాళ సాయంత్రం ఆమె అభిమానులతో ఫేస్‌బుక్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘తెరి’ చిత్రంలో అందర్నీ ఏడిపించారు? అని ప్రశ్నించారు. దీనికి సమంత వెంటనే నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘ఈ సన్నివేశం చేసే ముందు దర్శకుడు అట్లీ సీన్‌ చెప్పారు. అట్లీ.. థియేటర్లో అందరూ ఏడ్చేలా నా ప్రయత్నం చేస్తానని చెప్పా. అది నిజంగా జరగడం విజయంగా భావిస్తున్నా. ఆ చిత్రంలో నేను చనిపోతాను. ఈ సినిమాకు నా స్నేహితులతో కలిసి వెళ్లా. నేను చనిపోయే సన్నివేశం వస్తున్నప్పుడు.. స్క్రీన్‌వైపు చూడకుండా థియేటర్లో చుట్టుపక్కల అందర్నీ చూస్తూ కుర్చొన్నా. చైతన్య నా పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. ఆ సన్నివేశం చేసే ముందు అట్లీతో చాలా మాట్లాడాను. అందర్నీ ఏడిపించాలనుకున్నా.. ఏడిపించా’ అని నవ్వుతూ చెప్పారు. 

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే