అశ్విన్‌పై ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం

అశ్విన్‌పై ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం 

ఉత్తమ బౌలర్‌గా తనదైన ముద్ర వేసుకున్న అశ్విన్‌.. అటు బ్యాటింగ్‌లోనూ సత్తాచాటుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఏడాది ఐసీసీ మేటి క్రికెటర్‌, ఐసీసీ మేటి టెస్ట్‌ క్రికెటర్‌ అవార్డులు వరించాయి. అవార్డు అందుకున్న అశ్విన్‌కు ఓ వైపు అభినందనలు వెల్లువెత్తగా.. అదే సమయంలో ధోని అభిమానుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతగా అశ్విన్‌ ఏం చేశాడనేగా అనుమానం? అవార్డు దక్కిన సంతోషంలో ధోని పేరును ప్రస్తావించకపోవడమే అశ్విన్‌ చేసిన నేరమట.
ఐసీసీ అవార్డులు గెలుచుకున్న సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు ఈ యువ క్రికెటర్‌. ఈ సందర్భంగా తన భార్య ప్రీతి నారాయణ, కోచ్‌ అనిల్‌కుంబ్లే, టెస్ట్‌కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వాళ్ల తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించాడు. అయితే ఈ ట్వీట్‌ ధోని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై సోషల్‌మీడియాలో తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
2011లో ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే అశ్విన్‌ టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. అంతేకాక ఇద్దరూ ఒకే ఐపీఎల్‌(రైజింగ్‌ పుణె) జట్టులో ఆడుతున్నారు. అంతకుముందు వీరిద్దరూ చెన్నై సూపర్‌కింగ్స్‌ తరపున ఆడారు. అయితే అవార్డు అందుకున్న సందర్భంగా ధోని పేరును ప్రస్తావించకపోవడంతో ధోని అభిమానులకు కోపమొచ్చింది. దీంతో సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. తాను అశ్విన్‌ అభిమానినే అయినప్పటికీ.. ధోనిని విస్మరించడం బాధాకరమంటూ ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు.

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే