ఫోర్బ్స్ లిస్టులో మన స్టార్ హీరోల ర్యాంకింగ్స్ !
ఫోర్బ్స్ లిస్టులో మన స్టార్ హీరోల ర్యాంకింగ్స్ !
ప్రముఖ ఫోర్బ్స్ జాబితా ప్రతి సంవత్సరం ప్రకటించే ఫోర్బ్స్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ తాజాగా విడుదలైంది. దేశంలోని సినిమా, క్రీడా, టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ లిస్టులో ఉన్నారు. అలాగే టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు 33వ స్థానంలో ఉండగా తరువాత అల్లు అర్జున్ 43వ స్థానం ఆ తరువాత ఎన్టీఆర్ 55, రామ్ చరణ్ 67 వ స్థానాల్లో ఉన్నారు.
ఈ స్టార్ హీరోలంతా ఈ సంవత్సరం ఒక్కో సినిమాతో సందడి చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇకపోతే హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ 37వ స్థానంలో ఉంది. ఇకపోతే టాప్ లిస్టులో బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ , షారుక్ ఖాన్ లు 2, 3 స్థానాల్లో ఉండగా క్రికెటర్ విరాట్ కోహ్లీ 1వ స్థానంలో ఉన్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 53వ స్థానంలో ఉండగా కమల్ హాసన్ 78వ స్థానం ఉన్నారు.
Comments
Post a Comment