తారక్, బన్నీలను కలిపిన డైరెక్టర్!

తారక్, బన్నీలను కలిపిన డైరెక్టర్!


ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నా 
ఒక్క కుటుంబంలోని వారే చేస్తున్నారు. వెంకటేశ్-మహేశ్ బాబు, పవన్ కల్యాణ్-వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలే రెండు వేర్వేరు కుటుంబాల హీరోలు చేసిన సినిమాలు. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా వచ్చింది. ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల గురించి మాట్లాడినా.. ఒక్క కుటుంబంలోని హీరోల గురించే ప్రస్తావన వస్తోంది. హీరోలంతా తాము మల్టీస్టారర్ సినిమాల్లో చేసేందుకు రెడీ అంటున్నా.. ఆ దిశగా అడుగులు అయితే పడడం లేదు. తాజాగా ఆ దిశగా అడుగులు పడినట్టు చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. ఆ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడని చెప్పుకొంటున్నారు. అయితే.. వాళ్లిద్దరూ పూర్తి హీరోలుగా మాత్రం నటించరట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తీస్తున్న సినిమాలో వాళ్లిద్దరూ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆ అతిథి పాత్రల కోసం వారిద్దరినీ కలపాలని బోయపాటి యోచిస్తున్నాడట. అందుకు తగ్గట్టు స్క్రిప్టులో మార్పులు-చేర్పులు కూడా చేసినట్లు చెప్పుకొంటున్నారు. దాంతో పాటు సినిమా బడ్జెట్‌ను పెంచేశారట. ఇంతకుముందు 22 కోట్లతో తీయాలనుకున్న సినిమాకు.. రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారన్న ప్రచారం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో సాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఓ క్రేజీ కాంబోను తెరపై చూడొచ్చన్నమాటే.

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే