పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే

'కాట‌మ‌రాయుడు' సినిమా త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాలో న‌టించ‌నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'దేవుడే దిగి వ‌చ్చినా' అనే టైటిల్ సైతం ప్రచారంలో ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పుడో హాట్ న్యూస్ చెప్పబోతున్నాం. మీరు విని ఆశ్చర్యపోయే న్యూస్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఆ అనుబంధంతో వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఇక అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా చేసిన బొమన్ ఇరానీ నిసైతం ఈ సినిమా కోసం తీసుకున్నారు. కుష్బు మరో కీ రోల్ లో కనిపించనుంది. జనవరి 2017 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా చేయనున్నారు. 

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

కబాలి 2లో మరో కొత్త లుక్ లో రజనీ