రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..! చెన్నై: రూపాయి నోటు రూపొందించి బుధవారంతో వందేళ్లు పూర్తైంది. రూపాయ నోటా అని చులకనగా మాట్లాడినప్పటికీ ఇతర నోట్లు రూపొంద డానికి ఈ నోటే ఆదర్శవంతంగా వుంది. 1917 నవంబర్ 30న రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నాటి వర్తకులు ఈ నోటును తమ అవసరాలకు విరివిగా వినియో గించారు. కోయంబత్తూర్ మాజీ తపాలా శాఖ అధికారి హరిహరన ఈ పాత నోట్లను భద్రంగా తన వద్ద దాచుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, మొదటి రూపాయి నోటు ఇరువైపులా ఐదవ జార్జ్ ప్రభువు ఫొటో ముద్రించి వుంటుందని, 1935 ఏప్రిల్ 1వ తేదీన రూపాయి నోటు ముద్రణకు అనుమతిని భారత రిజర్వ్ బ్యాంక్‌కు ఆంగ్లేయులు అప్పగించారని తెలిపారు. అనంతరం ముద్రితమైన మొదటి రూపాయ నోటులో మొదట 8 భాషలు మాత్రమే వుండేవని, 1940లో ముద్రించిన నోటుపై 6వ జార్జ్ ఫొటోను ముద్రించారని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి పర్యవేక్షణలో ముద్రించిన రూపాయి నోటు ప్రజాదరణ పొందిందన్నారు. 1949లో ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్కే మేనన్ సంతకం చేసిన నోటుపై మొట్టమొదటిగా అశోకుడి స్తూపం చోటుచేసుకుందని, 1951లో హిం...
Comments
Post a Comment