అభిమానం కలవరపరిచింది

అభిమానం కలవరపరిచింది 

మకిష్టమైన నటీనటులను చూడాలని, వారి ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. కానీ ఈ అభిమానం హద్దులు దాటితే?.. ఫ్యాన్స్‌ తమను తాము ఇష్టపడేదానికన్నా ఎక్కువగా నటీనటులను ఇష్టపడితే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. తాజాగా ఇలాంటి అనుభవమే ‘రన్‌ రాజా రన్‌’, ‘కొలంబస్‌’, ‘టైగర్‌’ చిత్రాల్లో నటించిన నటి సీరత్‌ కపూర్‌కు ఎదురైంది. ఓ అభిమాని ఆమెపై ఉన్న ప్రేమను తెలుపుతూ.. తన చేయిపై ‘ఎస్‌’ ఆకారంలో గాటు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలుపుతూ.. ఫొటోను పంపాడు. దీన్ని చూసిన తర్వాత తనకు మాటలు రాలేదని సీరత్‌ ఆవేదన చెందారు. తన ట్విట్టర్‌లో ‘ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అని ఒక పోస్ట్‌ చేశారు. జీవితం చాలా విలువైనది.. అలాగే మీరు కూడా. ఎవరి కోసమో మీకు మీరు హాని చేసుకోవద్దు.. అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. దీనిని రకుల్‌ రీట్వీట్‌ చేస్తూ ఇది చాలా కలవరపరిచే విషయమని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే