అంటార్కిటికాలో హిట్లర్ రహస్య స్థావరం.
అంటార్కిటికాలో హిట్లర్ రహస్య స్థావరం.
అంటార్కిటికాలో విల్కీస్ ల్యాండ్ అనే ధట్టమైన మంచుతో కప్పపడిన ద్వీపంలో నాజీల ‘యూఎఫ్‌వో రహస్య స్థావరం’ ఉందని కొందరు పరిశోధకులు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాధించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ అంటార్కిటికాలో యూఎఫ్‌వో (ఎగిరే పళ్లాలు)ల కోసం ఓ రహస్య స్థావరాన్ని నిర్మింప చేశాడని యూఎఫ్‌వో హంటర్లు పేర్కొంటున్నారు. దీని సంబంధించిన వివరాలను ‘సెక్యూర్‌టీం10’ బృందం తమ యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోలో తెలిపారు. ‘‘అంటార్కిటికాలోని మంచు కింద ఏముందో ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. ఈ రహస్యం ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. అయితే, ఇటీవల అక్కడ కొన్ని మానవ నిర్మాణాల ఆనవాళ్లు కనిపించాయి. మంచు పర్వతాల పక్కన అక్కడక్కడ కొన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల రంధ్రాలు ‘ఎగిరే పళ్లెం’ ఆకారంలో ఉన్నాయి. వీటి గుండా వెళ్లాలంటే ఏదైనా ఎగిరే వస్తువుతోనే సాధ్యం. అది కూడా ఆ రంధ్రం ఆకారాంలోనే ఉండాలి’’ అని వారు వివరించారు. అయితే, ఈ రహస్య మార్గల గురించి అమెరికా నావికా దళం ‘మిషన్ హై జంప్’ పేరుతో రహస్యంగా పరిశోధనలు చేస్తోందని చెబుతున్నారు. అంటార్కిటికాలో జర్మన్ నాజీలు యూఎఫ్‌వో స్థావరాన్ని నిర్మించారని, ఈ మార్గలు ఆ స్థావరానికి చెందినవేనని ప్రతిపాధిస్తున్నారు. భూ గర్భంలోని రహస్య లోకాలను కనుగొనేందుకు నాజీలు ఇక్కడ ఈ స్థావరాన్ని నిర్మించి ఉంటారని యూఎఫ్‌వో అన్వేషకులు పేర్కొంటున్నారు.
Comments
Post a Comment