చిరుపై బాలయ్యదే పైచెయ్యా?
చిరుపై బాలయ్యదే పైచెయ్యా?
సంక్రాంతికి నువ్వా-నేనా అన్నట్టుగా రెండు పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఆ సినిమాలేవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో. అవే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150, బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఇద్దరికీ ఆ సినిమాలు ప్రతిష్ఠాత్మకమే. మెగాస్టార్ చిరంజీవి దశాబ్ద కాలం గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా కావడం, అదీ 150వ చిత్రం కావడంతో దానిపై అంచనాలు తారస్థాయినే తాకాయి. ఇటు బాలయ్య వందో చిత్రం కావడంతో దానిపైనా అంచానాలు మిన్నగానే ఉన్నాయి. కానీ, బాలయ్యపై చిరంజీవే ఓ మెట్టు ఎక్కువున్నాడు. అయితే.. ఆ పరిస్థితి తర్వాత తారుమారైందట. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చారిత్రక కథాంశం కావడంతో ఆ సినిమాకు అంత సీన్ లేదు అనుకున్నారట ఫిల్మ్‌నగర్‌లో. దీంతో అందరి చూపు ఖైదీ నంబర్ 150పైనే పడిందంటున్నారు. ఇప్పుడు శాతకర్ణి సినిమా ట్రైలర్లు, దానిని తెరకెక్కించిన విధానంతో మెగా కాంపౌండ్‌ను వెనక్కు నెట్టేశాడట శాతకర్ణి. మొన్నటిదాకా టాలీవుడ్‌లో నాలుగు, ఐదో స్థానంలో ఉన్న శాతకర్ణి ట్రైలర్ ఇప్పుడు మొదటి స్థానంలోకి రావడంతో.. మెగా హీరోల రేటింగ్ పడిపోయిందా? అని చర్చించుకుంటున్నారట. అంతేకాదు.. ఖైదీ నంబర్ 150 కన్నా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకే పాపులారిటీ ఎక్కువగా వస్తోందన్న వినికిడి ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సత్తా ఏంటో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూస్తే సరి!!
Comments
Post a Comment