న్యూఇయర్‌ రోజున ‘విరుష్క’ ఎంగేజ్‌మెంట్‌!

న్యూఇయర్‌ రోజున ‘విరుష్క’ ఎంగేజ్‌మెంట్‌!


ఎన్నో ఏళ్లుగా ప్రేమ సాగరంలో మునిగితేలుతున్న స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ హీరోయిన్‌ అనుష్కాశర్మలు ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే తమ ప్రేమను బహిర్గతం చేసిన ఈ ప్రేమపక్షులు తమ బంధాన్ని మరో మెట్టు పైకి ఎక్కించాలనుకుంటునట్టు సమాచారం. అందుకే కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌లు మార్చుకుంటున్నారట. వీరి నిశ్చితార్థం న్యూ ఇయర్‌ రోజైన జనవరి 1న ఉత్తరాఖండ్‌లో జరుగబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి ఓ హోటల్‌లో తమ ఎంగేజ్‌మెంట్‌ను వైభవంగా చేసుకోబోతున్నారట. ఈ కార్యక్రమానికి అమితాబ్‌ ఫ్యామిలీతో బాటు అంబాని, కపూర్‌ కుటుంబాలు కూడా హాజరుకాబోతున్నట్టు సమాచారం. అలాగే ఇతర బాలీవుడ్‌ ప్రముఖులు, స్టార్‌ క్రికెటర్లు కూడా ఉత్తరాఖండ్‌కు పయనమవబోతున్నారట. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరూ అధికారికంగా ధ్రువీకరించలేదు.

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే