‘వంగవీటి’ నా చివరి సినిమా.. రెండోసారి ప్రకటించిన వర్మ

‘వంగవీటి’ నా చివరి సినిమా.. రెండోసారి 

ప్రకటించిన వర్మ


‘వంగవీటి’ తన చివరి సినిమా అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ రెండోసారి ప్రకటించారు. విజయవాడ రౌడీయీజం బ్యాక్ డ్రాప్‌లో తీసిన వంగవీటిపై మొత్తం టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వంగవీటికి ఆర్జీవీ ప్రమోషన్ ఇస్తున్నారు. వర్మ సినిమాలో ఈ మధ్య కాలంలో లేనన్ని వివాదాల్ని వంగవీటి సృష్టించింది. ఈ చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందా? ‘వంగవీటి’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ‘సినిమాల గురించి తక్కువగా..వివాదాల గురించి ఎక్కువగా’ మాట్లాడే వర్మ వంగవీటి తన కేరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అంటూ తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. శివ సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసిన ఆర్జీవీ మరోసారి అలాంటి సక్సెస్ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు విజయవాడ రౌడీయీజం రాజకీయం బ్యాక్ డ్రాప్‌లో వస్తున్నవే. మాఫియా, రౌడీయీజాన్ని కొత్తగా చూపించడంలో వర్మకు టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ ప్రత్యామ్నాయం లేదు. 1970లో బెజవాడలో ఊపేసిన రౌడీయీజం, హత్యలు, రాజకీయాలు అనంతర పరిణామాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
 
1970లో జరిగిన చలసాని వెంకటరత్నం హత్య దగ్గర నుంచి 1988లో జరిగిన వంగవీటి రంగా హత్య వరకు జరిగిన పరిణామాలకు మెలోడ్రామాను తోడుచేసి వర్మ, వంగవీటిని తెరకెక్కించారు. వంగవీటి టీజర్ వదలగానే వివాదాలు మొదలయ్యాయి. సినిమాలో రంగాపై అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే అడ్డుకుంటామని రంగా కుమారుడు రాథా హెచ్చరించారు. ఇంతలోనే రెండు సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ పాట విడుదల కావడంతో మరో విదాదం తలెత్తింది. వంగవీటి అభిమానులు వర్మకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వంగవీటి కుటుంబ సభ్యులతో వర్మ భేటీ అయ్యారు. ఎవరేమన్నా సినిమా విడుదల చేసి తీరతానని వర్మ గట్టిగా చెప్పారు. వంగవీటి అభిమానులు భారీగా ఉన్నవిజయవాడలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే థియేటర్ల యజమానులు మాత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రాలేదని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వంగవీటిని సినిమాగానే చూస్తున్నామని, ఇందులో వ్యక్తిగత అంశాలకు తావులేదని ప్రకటించిన నెహ్రూ, వర్మకు మద్దతు పలికారు. దీంతో వంగవీటి టీమ్ కాస్త ఊపిరి పీల్చుకుంది

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే