Popular posts from this blog
బన్నీ, నాని ఒకే రోజు ?
బన్నీ, నాని ఒకే రోజు ? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని తమ లేటెస్ట్ సిఎంమాలతో ఒకే రోజు థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు.. ఇప్పటికే ఇద్దరు ఒకే డేట్ ని తమ సినిమాల కోసం లాక్ కూడా చేసేసుకున్నారు.. ఒక వైపు బన్నీ మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో జూన్ 23 న వస్తుంటే, మరో వైపు ఈ డేట్ బన్నీ కంటే ముందే లాక్ చేసుకొని తన లేటెస్ట్ ఫిలిం ‘నిన్ను కోరి’ ని థియేటర్స్ లోకి తీసుకురాకురాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించేశాడు నాని. సో నిన్నటి వరకూ ఈ డేట్ ని నాని మాత్రమే ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ స్పెషల్ గా లాక్ చేసుకున్నాడు బన్నీ. మరి జూన్ 23 న బన్నీతో నాని పోటీ పడతాడా..? లేదా ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకొని మరో డేట్ కి షిఫ్ట్ అవుతాడా… చూడాలి..
మాహిష్మతి సామ్రాజ్యంలో బాహుబలి 2 ఈవెంట్
మాహిష్మతి సామ్రాజ్యంలో బాహుబలి 2 ఈవెంట్ మాహిష్మతి కింగ్ డమ్ లో బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మార్చి 26 న జరగబోయే ఈవెంట్ కోసం స్పెషల్ గా మాహిష్మతి సెట్ నిర్మిస్తున్నారు. తన ప్రతి సినిమా ప్రమోషన్ ని సరికొత్తగా ప్లాన్ చేసుకునే రాజమౌళి బాహుబలి 2 కోసం ఏకంగా కింగ్ డమ్ సెట్ నే ప్లాన్ చేశాాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే ఆడియోని కూడా రిలీజ్ చేస్తారు. నిజానికి రామోజీ ఫిలింసిటీలో మాహిష్మతి సెట్ ఎప్పట్నుంచో ఉంది. అందులోనే మ్యాగ్జిమమ్ షూటింగ్ నడిచింది. అయితే యాజ్ ఇటీజ్ ఆ ఒరిజినల్ సెట్ లోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టడానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే ఫిలింసిటీ బయట ఏర్పాటుచేస్తున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం మరోసారి చిన్న సైజు మాహిష్మతి సెట్ ను నిర్మిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఏప్రియల్ 28 న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Comments
Post a Comment