కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా ‘యంగ్ టైగర్ ‘ !
కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా ‘యంగ్ టైగర్ ‘ !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. గత సంవత్సరం ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.ఇందుకుగాను జీ సినిమా అవార్డ్స్ లో ఎన్టీఆర్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫిస్ అవార్డు ని గెలుచుకున్నారు. గత సంవత్సరం ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. విజయాలు సాధించడం లో తన వెనుక నిలబడి నటన పై ఫోకస్ చేసేలా ప్రోత్సాహించిన డైరెక్టర్స్ కి కూడా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులో కూడా అభిమానులను ఎంటైర్ టైన్ చేయడానికి ఇలాగే కృషి చేస్తానని,ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటానని ఎన్టీఆర్ తెలిపాడు.
Comments
Post a Comment