నమ్మక ద్రోహంతో హర్టయిన సమంత... అందరినీ పీకేసింది!
నమ్మక ద్రోహంతో హర్టయిన సమంత... అందరినీ పీకేసింది!
వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే సమంత..... తన పర్సనల్ పనులు, ఇతర వ్యవహారాలు చూసుకునేందకు ప్రత్యేకంగా ఓ టీంను నియమించుకుంది. వారిని ఎంతో నమ్మిన సమంత... వారిలో ఎవరో తనకు నమ్మక ద్రోహం చేసారనే అనుమానం రావడంతో ఒకేసారి అందరినీ పీకేసి కొత్త వారిని నియమించుకుంది. ఈ సంఘటన వెనక అలు కారణం... సమంత ఎంతో సెంటిమెంటుగా భావించే తన ఉంగరం మిస్ కావడే అని అంటున్నారు. షూటింగులకు వెళ్లే సమయంలో సమంత తన రింగును కారులోనే పెట్టేసి వెలుతుంది. షూటింగ్ పూర్తయ్యాక మళ్లీ తన చేతికి పెట్టుకుంటుంది. ఎప్పటిలాగే రింగును కారులో పెట్టి వెళ్లిన సమంత.... తాను తిరిగి వచ్చేసరికి అది మిస్ కావడంతో తీవ్ర అసహనానికి గురైందని.... తాను వారిని ఎంతో నమ్మాను, వారిని ఎంతో బాగా చూసుకున్నాను, కానీ నాకు నమ్మక ద్రోహం చేసారు అంటూ.... అందరినీ పీకేసిందని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.
Comments
Post a Comment