ప్రీలుక్‌‌తోనే ‘హంటర్’ను హీటెక్కించిన అవసరాల!

ప్రీలుక్‌‌తోనే ‘హంటర్’ను

 హీటెక్కించిన అవసరాల!




కమెడియన్‌గానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించాడు అవసరాల శ్రీనివాస్‌. ఇటీవల నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్మెన్‌’ సినిమాలో విలన్‌గా కూడా నటించిన అవసరాల.. ఇప్పుడు హీరో అవతారం ఎత్తాడు. బాలీవుడ్‌లో విడుదలైన అడల్డ్‌ కామెడీ మూవీ ‘హంటర్‌’ తెలుగు వెర్షన్‌లో కీలకపాత్రలో మెరవనున్నాడు.
 
మనిషికి నిద్ర, ఆకలి, దాహం లాగానే సెక్స్‌ కూడా ఓ అవసరం అని చెప్పే ఓ బోల్డ్‌ క్యారెక్టర్‌లో అవసరాల నటిస్తున్నాడు. బాలీవుడ్‌ ‘హంటర్‌’లో రాధికా ఆప్టే చాలా బోల్డ్‌గా నటించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో మిస్త్రీ చక్రవర్తి (చిన్నదాన నీకోసం ఫేమ్‌), యాంకర్‌ శ్రీముఖి, తేజస్వి, సుప్రియ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవలె ప్రీలుక్‌ను విడుదల చేశారు. మునిపంటి కింద నలుగుతున్న ఆమ్మాయి పెదాలను ఆ ప్రీలుక్‌ పోస్టర్‌లో ముద్రించారు. ఈ పోస్టర్‌తోనే హీట్‌ పెంచేశారు. అంతేకాదు ఆ పోస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించారు.

Comments

Popular posts from this blog

అదరగొట్టిన జైలవకుశ మూవీ లోగో లాంచ్

బన్నీ, నాని ఒకే రోజు ?

ట్విట్టర్ లో కాటమరాయుడు హంగామా