రూ. 1500 కోట్ల మైలురాయిని చేరిన ‘బాహుబలి-2’

రూ. 1500 కోట్ల మైలురాయిని చేరిన ‘బాహుబలి-2’ 


ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం మూడో వారం చివర్లో కూడా పూర్తి స్థాయి హవా చూపిస్తోంది. ప్రదర్శింపబడుతున్న అన్ని చోట్ల దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. మొదటి రెండు వారాల్లోనే ఇండియాలో రూ. 1020 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని ప్రస్తుతం మూడు వారాలు గడిచేసరికి రూ.1500 కోట్ల మైలురాయిని చేరింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇండియాలో రూ. 953 కోట్ల నెట్, రూ. 1,227 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్లో రూ. 275 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్లు రూ. 1,502 కోట్లకు చేరుకుంది. దీంతో వరల్డ్ వైడ్ కలెక్షన్లలో ఇండియా తరపున ఒక తెలుగు చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే