Popular posts from this blog
రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!
రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..! చెన్నై: రూపాయి నోటు రూపొందించి బుధవారంతో వందేళ్లు పూర్తైంది. రూపాయ నోటా అని చులకనగా మాట్లాడినప్పటికీ ఇతర నోట్లు రూపొంద డానికి ఈ నోటే ఆదర్శవంతంగా వుంది. 1917 నవంబర్ 30న రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నాటి వర్తకులు ఈ నోటును తమ అవసరాలకు విరివిగా వినియో గించారు. కోయంబత్తూర్ మాజీ తపాలా శాఖ అధికారి హరిహరన ఈ పాత నోట్లను భద్రంగా తన వద్ద దాచుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, మొదటి రూపాయి నోటు ఇరువైపులా ఐదవ జార్జ్ ప్రభువు ఫొటో ముద్రించి వుంటుందని, 1935 ఏప్రిల్ 1వ తేదీన రూపాయి నోటు ముద్రణకు అనుమతిని భారత రిజర్వ్ బ్యాంక్‌కు ఆంగ్లేయులు అప్పగించారని తెలిపారు. అనంతరం ముద్రితమైన మొదటి రూపాయ నోటులో మొదట 8 భాషలు మాత్రమే వుండేవని, 1940లో ముద్రించిన నోటుపై 6వ జార్జ్ ఫొటోను ముద్రించారని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి పర్యవేక్షణలో ముద్రించిన రూపాయి నోటు ప్రజాదరణ పొందిందన్నారు. 1949లో ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్కే మేనన్ సంతకం చేసిన నోటుపై మొట్టమొదటిగా అశోకుడి స్తూపం చోటుచేసుకుందని, 1951లో హిం...
ఐ హేట్ ఆమిర్..! సల్మాన్‌ఖాన్
నీ సినిమానే బాగుంది.. అందుకే ద్వేషిస్తున్నా! రెజ్లింగ్ నేపథ్యంతో సినిమాలు తీసున్నామని, అవి 2016లో విడుదల చేస్తామని ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రకటించినప్పుడు ఒకింత ఆసక్తితోపాటు ఆశ్చర్యపరిచింది. సల్మాన్ ’సుల్తాన్’, ఆమిర్ ’దంగల్’ చిత్రాల్లో ఎవరి సినిమా విజేతగా నిలుస్తుందన్న చర్చ జరిగింది. సల్మాన్ ’సుల్తాన్’ మొదట విడుదలైంది. భారీ కలెక్షన్లతో ఊహించినట్టుగానే ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సుల్తాన్ అలీఖాన్ అనే వ్యక్తి ఉత్థానపతనాలు ఇతివృతంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథ పూర్తిగా కల్పితం. కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ’దంగల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్ఫూర్తిదాయకంగా మలిచిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రివ్యూలు రావడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ ఏడాది వచ్చిన సుల్తాన్, దంగల్ సినిమాల్లో ఏది అత్యుత్తమ సినిమా అన్న చర్చ అభిమానుల్లో నడుస్తోంది. ఈ చర్చపై ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. తన సుల్తాన్ సినిమా కన్నా దంగల్ ఎంతో బాగుందని కితాబిచ్చాడు. ఆమిర్ వ్యక్తిగతం ప్రేమించినా....
Comments
Post a Comment