చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట! మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో మిగతా హీరోలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతర హీరోల సినిమాలు విజయవంతమైనపుడు ఫోన్ చేసి అభినందిస్తుంటాడు. ఇలా మహేష్, ఎన్టీయార్, అఖిల్, ప్రభాస్, రానాతో చరణ్‌కు మంచి స్నేహముంది. ఇలాంటి చరణ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలంటే చాలా అసూయట. చాలా రోజుల తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ‘ధృవ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. చరణ్‌కు యువహీరోలు శర్వానంద్, నానిలను చూస్తే చాలా అసూయట. ‘శర్వానంద్, నాని కథలను ఎంపికచేసుకునే విధానం నాకు అసూయను కలుగచేస్తుంటుంది. ఆ విషయంలో వాళ్లను చూసి కొన్నిసార్లు జెలసీగా ఫీలవుతా. వాళ్లలాగానే నాకూ విభిన్నమైన కథల్లో నటించాలని ఉంటుంద’ని తన మనసులో మాట బయటపెట్టాడు
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..? తెలుగు తెరపై మెరిసిన కుర్రకథానాయికల జాబితాలో అవికా గోర్ పేరు కూడా కనిపిస్తుంది. 'ఉయ్యాలా జంపాలా' .. 'సినిమా చూపిస్త మావ' వంటి హిట్స్ ఆమె ఖాతాలో వున్నాయి. ఆ తరువాత ఈ అమ్మాయి కొంత గ్యాప్ తీసుకుని అమెరికా వెళ్లింది. అక్కడ డైరెక్షన్లో డిప్లొమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అందరి మనసులను గెలుచుకుంది అవికా గోర్. ఆ బుల్లితెర క్రేజ్‌తోనే 'ఉయ్యాల జంపాల'తో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కొన్ని వరుస అవకాశాలు వచ్చినా వదులుకుంది. తదుపరి ఆమె చేసిన సినిమా 'సినిమా చూపిస్త మావ'. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పేరు తెచ్చుకుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... అవికా సినిమాలకి కొంత కాలం పాటు విరామం ఇవ్వాలనుకుంటోందట . తెలుగులో : అవికాగౌర్ చిన్నప్పటి నుంచి నటిస్తోంది. టీవీ సీరియళ్ల ద్వారా చాలా పాపులారిటీ సంపాదించింది. వృత్తి విషయంలో ఆమె చాలా డిసిప్లిన్డ్ గా వ్యవహరించేది. ఏనాడూ షూటింగ్ ఎగ్గొట్టడం కానీ, ఆలస్యంగా రావడం కానీ లేదు. త...
రివ్యూ.. : సప్తగిరి ఎక్స్ ప్రెస్ – కాస్త కామెడీ, కాస్త ఎమోషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అనుకోకుండా నటనలోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు సప్తగిరి ఇంకో అడుగు ముందుకేస్తూ హీరోగా చేసిన చిత్రమే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.. కథ : కానిస్టేబుల్ కొడుకైన సప్తగిరి (సప్తగిరి) తండ్రి మాటలు వినకుండా సినిమాల్లో వెళ్లాలని, పెద్ద నటుడవ్వాలని కలలుగంటూ అల్లరిగా తిరుగుతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోకుండా పెద్ద కష్టం ఎదురై సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టి పోలీస్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. అలా పోలీస్ డ్రెస్ వేసుకున్న సప్తగిరి ఆ ఉద్యోగంలో నానా కష్టాలు పడుతూ తన కుటుంబానికొచ్చిన కష్టానికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళను అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అసలు సప్తగిరి కుటుంబానికి వచ్చిన ఆ కష్టం ఏమిటి ? ఆ కష్టానికి కారణం ఎవరు ? సప్తగిరి వాళ్ళను ఎలా అంతం చేశాడు ? అన్నదే ఈ సినిమా కథ. ఓవర్ యక్షన్ చేయించకుండా: మాంచి మాస్ కథని ...
Comments
Post a Comment