కథ రిలీవ్ అయినా సినిమాకు ఏం నష్టంలేదన్న రాజమౌళి !
కథ రిలీవ్ అయినా సినిమాకు ఏం నష్టంలేదన్న రాజమౌళి !
సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’ ట్రైలర్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం విడుదలైంది. హైదరాబాద్లోని ఆర్కే సినీ కాంప్లెక్స్ లో అధికారికంగా థియేట్రికల్ ట్రేలర్ ను ప్రదర్శించారు. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, నిర్మాతలు, కె. రాఘవేంద్రరావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా విలేఖరులతో మాట్లాడిన రాజమౌళి ఒకసారి సినిమా ప్రదర్శితమైతే ముఖ్యమైన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే కథ తెలిసిపోతుంది కదా అప్పుడు సినిమాకు నష్టం వాటిల్లదా అనే ప్రశ్న రాగానే రాజమౌళి ఖచ్చితమైన సమాధానం చెప్పి తన ఆలోచన విధానం ఎంత పక్కాగా ఉందో తెలియజెప్పారు.
రాజమౌళి సమాధానం చెబుతూ ఫస్టాఫ్ చూస్తే సెకండాఫ్ ఏమిటో తెలిసిపోతుంది, కొంత మందైతే సినిమా మొదలైన కొద్దిసేపటికే తర్వాత మొత్తం ఏం జరుగుతుందో చెప్పేస్తారు. కానీ ఆ అసలైన పాయింట్ ఏంటంటే ఆ తెలిసిన దాన్ని కూడా ఎంత అందంగా చెప్పాం అనేదే ముఖ్యం. ఉదాహరణకు పురాణాలు రామాయణం, మహా భారతంలలో కథేమిటో అందరికీ తెలుసు. కానీ ఆ కథని ఎంత అందంగా చెప్పారనే దాని కోసమే చూస్తారు. అలాగే ఇప్పటి దాకా సాలు కథను చాలా మంది గెస్ చేయడానికి ట్రై చేశారు. అందులో చాలా వరకు ఫెయిల్ అయ్యారు, కొందరు మాత్రం దరిదాపుల్లోకి వచ్చారు అంటూ ఈ సినిమా ఎంత అందంగా చెప్పబడిందో వివరించారు.

Comments
Post a Comment