ఎక్కడికి వెళ్తున్నావ్‌ డోరా?

ఎక్కడికి వెళ్తున్నావ్‌ డోరా?

ముఖంలో ఆందోళన, నుదుట రక్తం... ఒంటరిగా కారు నడుపుతూ ఎక్కడికో వెళ్తున్నారు నయనతార. ఇంత కంగారుగా ఎక్కడికెళుతున్నారని ఏవేవో ఊహించుకోవద్దు. కొత్త సినిమా కోసమే నయనతార బయలుదేరారు. ఈ బ్యూటీ ముఖ్యతారగా రూపొందుతోన్న తమిళ హారర్‌ కామెడీ మూవీ ‘డోరా’. ఇక్కడున్న స్టిల్‌ చూస్తే.. పెద్ద గండం నుంచి నయన తప్పించుకుని వెళ్తున్నట్టుంది కదూ! ఈ సిట్యువేషన్‌కి తగ్గట్టు సినిమాలో ‘ఎంగ పోర డోరా’ (‘ఎక్కడికి వెళ్తునావ్‌ డోరా’ అని అర్థం) అనే పాటను స్వరపరిచారు.
శుక్రవారం ఈ పాటను విడుదల చేశారు. పాట విన్న ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ‘మాయ’ (తెలుగులో ‘మయూరి’) తర్వాత నయనతార ప్రధానపాత్రలో నటిస్తున్న హారర్‌ చిత్రమిది. కొత్త కుర్రాడు దాస్‌ రామసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌–మెర్విన్‌ ద్వయం సంగీతం అందిస్తున్నారు.

Comments

Popular posts from this blog

చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్