వజ్రాలు కావాలా?

వజ్రాలు కావాలా?

అనిల్‌ బురగాని, నేహాదేశ్‌ పాండే, నిఖితా బిస్ట్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా?’. పి.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కిశోర్‌ కుమార్‌ కోట నిర్మించారు. జాన్‌ పొట్ల స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరా బాద్‌లో విడుదల చేశారు. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ బిగ్‌ సీడీ రిలీజ్‌ చేయగా, మరో నిర్మాత సాయి వెంకట్‌ పాటల సీడీ విడుదల చేసి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారా యణకు అందించారు.
‘‘ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక వీఎఫ్‌ఎక్స్‌లో చేరా. అప్పుడు కిషోర్‌ పరిచయమయ్యారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ, అడక్కుండానే నాకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చారాయన. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీశాం’’ అని దర్శకుడు అన్నారు. విజయ్‌ సాయి, చిట్టిబాబు, కోట కిశోర్‌ కుమార్, ప్రసాద్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్‌ కుమార్‌.

Comments

Popular posts from this blog

చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్