ఎన్టీఆర్ ని 'లైన్'లో పెట్టిన క్రిష్ !
ఎన్టీఆర్ ని 'లైన్'లో పెట్టిన క్రిష్ !
కమర్షియల్ లెక్కలు ప్రక్కన పెట్టి సినిమాలు చేసే దర్శకుడు క్రిష్. క్రిష్ కథలో మట్టి వాసనలు, దేశభక్తి, సామాజిక అంశాలు, మన చుట్టూ తిరిగే మనుషుల జీవితాలు కనబడతాయి. ఇప్పుడాయన చరిత్రని తవ్వే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పటికే మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో 'కంచె' తెరకెక్కించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం పరోక్షంగా పాల్గొన్న అంశానికి, ప్రేమ కథని జోడించి కులాల కంచెలు చెరిపేయాలని సూచించాడు. ఇక, బాలయ్య వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని తీసుకొస్తున్నారు. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి 'గౌతమీపుత్ర శాతకర్ణి' జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.
ఇటీవలే రిలీజైన శాతకర్ణి ట్రైలర్ రికార్డు సృష్టిస్తోంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.
అయితే, తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికరమైన లైన్ వినిపిస్తోంది. అదేంటంటే.. ? బాబాయ్ బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా తర్వాత క్రిష్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారంలోని సారాంశం. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం క్రిష్ ఓ లైన్ అనుకొన్నాడట. ఆ లైన్ ని త్వరలోనే తారక్ కి వినిపించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆ లైన్ తారక్ కి నచ్చితే పూర్తి స్క్రిప్టుని రెడీ చేసే పనిలో పడతాడని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఎన్టీఆర్ చేతిలో బాబీ సినిమా తప్ప మరో చిత్రం లేదు. క్రిష్ చెప్పబోయే లైన్ ఎన్టీఆర్ కి నచ్చినట్టయితే.. త్వరలోనే ఎన్టీఆర్-క్రిష్ చిత్రం సెట్స్ పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Post a Comment