‘కాటమరాయుడు’ సెట్‌ నుంచి లైవ్‌..


‘కాటమరాయుడు’ సెట్‌ నుంచి లైవ్‌.. 

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రం సెట్‌లో పవన్‌.. నటులు శివబాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, చైతన్యలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తీసిన సెల్ఫీలను శివబాలాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ‘కాటమరాయుడు’ లొకేషన్స్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారమని, తాను ఎంత సంతోషంగా ఉన్నానో వివరించలేనని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తని పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో పవన్‌ ముగ్గురు సోదరులుగా అజయ్‌, శివబాలాజీ, కమల్‌ కామరాజు నటిస్తున్నట్లు సమాచారం.
నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ ‘కాటమరాయుడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘వీరమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Comments

Popular posts from this blog

చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్