ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్


యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్థిక వ్యవస్థను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. సుమారు 150 ఏళ్ల చరిత్రలో యూకే ఆర్థిక వ్యవస్థను ఇండియా అధిగిమించడం ఇదే తొలిసారి. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇండియాలో వేగవంతమైన ఆర్థికవృద్ధి చోటు చేసుకోగా, 12 మాసాల్లోనే బ్రిటన్ పౌండ్ విలువ అమాంతం పడిపోయిందంటూ ఫోర్బ్స్ మ్యాగిజైన్ తెలిపింది. బ్రిటన్ పౌండ్ విలువ గత 12 మాసాలుగా 20 శాతం విలువ కోల్పోవడంతో 2020 నాటికి యూకే జీడీపీని భారత్ అధిగమిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

అయితే 2016 యూకే జీడీపీ విలువ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ప్రకారం 1.87 ట్రలియన్లు... ఇది అమెరికన్ డాలర్లలోకి మారిస్తే దాని విలువ 2.29 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని, పౌండ్ విలువలో డాలర్‌తో పోల్చుకుంటే 0.81 శాతం...అలాగే ఇండియన్ జీడీపీ రూపాయల్లో 153 ట్రిలియన్లు, దీన్ని డాలర్లలోకి మారిస్తే 2.30 ట్రిలియన్లు విలువ ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.6 పైసలని నివేదిక పేర్కొంది.

2020 నాటికి ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించనుందని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రిసెర్చ్ డిసెంబరు 2011లో తెలిపింది. కానీ అంతకు ముందే ఈ మార్కును భారత్ చేరుకుంది. 2020 వరకు భారత ఆర్థికవృద్ధి ఏటా 6 నుంచి 8 శాతం ఉంటుందని, ఇదే దశలో యూకే ఏటా 1 నుంచి 2 శాతం వృద్ధి మాత్రమే సాధించనుందని తెలిపింది. దీనిపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాతి స్థానంలో ఉన్న యూకేను అధిగమించి ఇండియా నిలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఇండియాకు ఇది గొప్ప ముందడుగని రిజుజు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇండియా యూరోపియన్ దేశాలను అధిగమించనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అక్టోబరు 8 న పేర్కొంది. ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్న భారత్ జీడీపీ యూకే కంటే కేవలం 50 బిలియన్ డాలర్లు మాత్రమే వెనుకబడి ఉందని, సంవత్సరాంతానికి దాన్ని చేరుకుంటుదని ఆ సంస్థ తెలిపింది.

India overtakes UK & becomes 5th largest GDP after USA, China, Japan & Germany. India may have large population base but this is a big leap.

Comments

Popular posts from this blog

చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్