‘శాతకర్ణి’ గురించి ట్వీట్ చేసిన ఎన్టీయార్, కల్యాణ్‌రామ్!
‘శాతకర్ణి’ గురించి ట్వీట్ చేసిన ఎన్టీయార్, కల్యాణ్‌రామ్!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు పలువురు రాజకీయ, చిత్ర ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నందమూరి హీరోలు ఎన్టీయార్, కల్యాణ్‌రామ్ కూడా తమ బాబాయ్ వందో సినిమా ట్రైలర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
‘శాతకర్ణి’ ట్రైలర్‌ను చూసిన కల్యాణ్‌రామ్, ఎన్టీయార్ ట్విట్టర్ ద్వారా తమ ఫీలింగ్స్‌ను పంచుకున్నారు. ‘దేశం మీసం తిప్పడం’ అనే డైలాగ్‌ను కోట్ చేసిన కల్యాణ్‌రామ్.. ట్రైలర్‌లో బాలయ్య అద్భుతంగా ఉన్నారని ట్వీట్ చేశాడు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, బాలయ్యను కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు క్రిష్‌కు అభినందనలని ఎన్టీయార్ ట్వీటేశాడు.
కొంతకాలంగా బాబాయ్-అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్‌పై ఎన్టీఆర్ స్పందించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Comments
Post a Comment