ఎన్టీఆర్‌ ‘ఓకే’ అనేశాడు!


ఎన్టీఆర్‌ ‘ఓకే’ అనేశాడు!
‘జనతా గ్యారేజ్‌’ తరవాత ఎన్టీఆర్‌ చేయబోయే సినిమా ఏమిటి? ఎవరితో? అనే విషయాలపైౖ ఆయన అభిమానులే కాదు, తెలుగు చిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఎన్టీఆర్‌ ఈ విషయంలో తొందర పడటంలేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చాలా కథలు విన్నా.. ఏదీ పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు ఓ కథ బాగా నచ్చింది. వెంటనే పచ్చజెండా వూపేశాడు. ‘పవర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాల దర్శకుడు బాబి ఎన్టీఆర్‌కి తగిన కథ చెప్పి ఒప్పించాడు. దాంతో ‘జనతా గ్యారేజ్‌’ తరవాత ఎన్టీఆర్‌ చేయబోయే చిత్రంపై స్పష్టత వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. త్వరలోనే లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభిస్తారు. 2017లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది.

Comments

Popular posts from this blog

చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్