ఎన్టీయార్ చేతికి రవితేజ స్క్రిప్ట్
ఎన్టీయార్ చేతికి రవితేజ స్క్రిప్ట్
‘జనతాగ్యారేజ్’ విజయం తర్వాత ఎన్టీయార్ మరింత జాగ్రత్తపడుతున్నాడు. తర్వాతి చేయబోయే సినిమా గురించి ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఎంతోమంది కథలను వింటున్న ఎన్టీయార్‌ను ఎట్టకేలకు ఇద్దరు దర్శకులు కన్విన్స్ చేయగలిగారట. వారిలో ఒకరు అనిల్ రావిపూడి కాగా, మరొకరు బాబి.
దర్శకుడు బాబి, అతని టీమ్ హీరో రవితేజ కోసం అద్భుతమైన స్ర్కిప్టును తయారుచేశారు. ఈ సినిమా చేయాలని రవితేజ కూడా అనుకున్నాడు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథను ఎన్టీయార్‌కు చెప్పాడట బాబి. ఆ కథ ఎన్టీయార్‌కు నచ్చిందట. అయితే బాబికి ఎన్టీయార్ ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదట. ఎందుకంటే అంతకుముందే అనిల్ రావిపూడి చెప్పిన లైన్ కూడా ఎన్టీయార్‌కు నచ్చిందట. పూర్తి కథ సిద్ధం చేసుకుని రమ్మని అనిల్‌కు చెప్పాడట ఎన్టీయార్. అనిల్ ఆ కథ తయారు చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే బాబి కథ ఎన్టీయార్ దగ్గరకు వచ్చింది. దీంతో అనిల్, బాబి మధ్య పోటీ మొదలైంది. అనిల్ బౌండెడ్ స్ర్కిప్టు ఎన్టీయార్‌ను సంతృప్తిపరచలేకపోతే బాబినే అదృష్టం వరించే ఛాన్సుంది.

Comments
Post a Comment