‘ఖైదీ నెం. 150’ లాస్ట్ సాంగ్ షూట్ ఎప్పుడూ..?!
‘ఖైదీ నెం. 150’ లాస్ట్ సాంగ్ షూట్ ఎప్పుడూ..?!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తోండడం, ఆయనకిది 150వ సినిమా కావడం లాంటి అంశాలతో ఖైదీ నెం. 150 మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, చివరి పాట షూటింగ్ ఒక్కటి మిగిలి ఉంది. తాజాగా ఈ సాంగ్‌ను ఈవారమే పూర్తి చేసేందుకు టీమ్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
డిసెంబర్ 2నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చివరి పాట షూటింగ్ జరగనుంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్‌లపై ఈ పాట ఉంటుందట. భారీ బడ్జెట్‌తో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా చిరు అభిమానులకు పండగ తెచ్చిపెడుతుందన్న ప్రచారం జరుగుతోంది. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘కత్తి’కి రీమేకే ఈ ‘ఖైదీ నెం. 150’!
Comments
Post a Comment