ఇక ఇంటినుంచే జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు

ఇక ఇంటినుంచే జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు


కేంద్ర ప్రభుత్వం జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీని పారదర్శకం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి జననం, మరణం ఇంటి నుంచి కూడా ఆన్ లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. సివిల్‌ రిజిస్ర్టేషను సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) పేరుతో గురువారం నుంచి యాప్‌ను అమలులోకి తెస్తోంది. యాప్‌లో వివరాలను నమోదు చేస్తే 15 రోజులల్లోగా ధ్రువపత్రాన్ని ఆన్ లైన్ లో ఉంచుతారు.



ఇంతవరకు రాష్ట్రాల వారీగా జనన మరణాల నమోదు ప్రక్రియ జరిగేది. ప్రస్తుతం ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు, నగరపాలక సంస్థల్లో జనన, మరణాల జాబితాను ఆనలైన చేయాలని ఆరు నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సివిల్‌ రిజిస్ర్టేషను సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) పేరుతో గురువారం నుంచి అమలులోకి తెస్తోంది. స్థానిక మెడికల్‌ అసోసియేషన్ హాలులో బుధవారం మున్సిపల్‌ గణాంకాధికారి కార్యాలయ అధికారులు, సిబ్బంది పట్టణంలోని వైద్యులకు నూతన విధానంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఇప్పటివరకు దళారుల దోపిడీ 
ఇప్పటివరకు జనన, మరణాలను పొందేందుకు ప్రజల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆస్పత్రుల్లో నమోదు చేయకపోయినా, ఇంటి వద్ద జరిగిన జననాలు నమోదు చేయకపోయినా ఎన్ వోసీ, తహసీల్దార్‌, ఆర్డీవో, మున్సిపల్‌ కార్యాలయాలకు తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొందరు దళారులు సుమారు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు.
అంతా ఆన్ లైన్ .. 
ఈ పరిస్థితిలో జనన, మరణాలను ఇంటి నుంచే నమోదు చేసుకునే సీఆర్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి మున్సిపాలిటీలో ఇది అమలులోకి వస్తుంది. ఇందు కోసం ప్రజలు గూగుల్‌ ప్లే స్టోర్‌లో సాఫ్ట్‌వేర్‌ను డౌన్ లోడ్‌ చేసుకుని వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్ లైన్లో వివరాలను నమోదు చేస్తే 15 రోజులల్లోగా దరఖాస్తుదారునికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ సవ్యంగా ఉంటే జనన, మరణాల రిజిస్ట్రార్ డిజిటల్‌ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని ఆన్ లైన్లో ఉంచుతారు. దరఖాస్తుదారులు డౌన్ లోడ్‌ చేసుకోవచ్చు. వైద్యులు కూడా మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చే పని లేకుండా తమ ఆస్పత్రుల్లో జనన, మరణాల వివరాలను ఆన్ లైన్లో నమోదు చేస్తే చాలు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుతుంది. దరఖాస్తుదారుని ఫోన నెంబరు లేదా ఈ మెయిల్‌కు దరఖాస్తు స్థితి సమాచారం వస్తుంది.
ఇక నుంచి కేంద్రానిదే బాధ్యత 
ఇప్పటి వరకు జనన, మరణాల రికార్డులను, నమోదు ప్రక్రికయ రాషా్ట్రల వారీగా జరిగేది. ఇక నుంచి ఈ ప్రక్రియను కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. ఇప్పటికే వివరాలు మొత్తం ఆనలైన చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ కార్యక్రమం గత ఆరు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతోంది. నిత్యం జిల్లాలో రమారమి 750 జననాలు, 300 మరణాల వరకు నమోదవుతున్నాయి.

Comments

Popular posts from this blog

చరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే అసూయట!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

రివ్యూ.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ – సూపర్ స్పీడ్ కామెడీ , కాస్త ఎమోషన్