రామ్ గోపాల్ వర్మకి హైకోర్ట్ నోటీసులు !
రామ్ గోపాల్ వర్మకి హైకోర్ట్ నోటీసులు !
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా వర్మ తన వివాదాత్మక చిత్రం ‘వంగవీటి’ యొక్క ఆడియో వేడుకను విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య కాలేజ్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 3న జరపనున్నట్టుగా ప్రకటించాడు. దీంతో విజయవాడకు చెందిన వంగవీటి రాధా సినిమాలో వంగవీటి రంగాను నెగెటివ్ కోణంలో చూపే ప్రయత్నం జరిగిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు రామ్ గోపాల్ వర్మకు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కు నోటీసులు జరీ చేసింది.
విజయవాడ రౌడీఇజం, రాజకీయల నైపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుండి అనేక వివాదాలు వస్తూనే ఉన్నాయి. వర్మ సున్నితమైన అంశాలను కదిపి మళ్ళీ గొడవలకు ప్రేరేపిస్తున్నాడని, రెండు ముఖ్యమైన సామాజిక వర్గాల్లో దేన్నీ తక్కువగా చూపిన అల్లర్లు జరగడం ఖాయమని ఆరంభంలోనే చాలా మంది వర్మ ప్రయత్నాన్ని వ్యతిరేకించారు. ఒక దశలో వర్మకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా వేటికీ బెదరని వర్మ సినిమాని పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేశాడు. మరిప్పుడు డిసెంబర్ 2న వాదనకు రానున్న ఈ కేసు పై ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.
Comments
Post a Comment