Posts

Showing posts from May, 2017

సూపర్ హిట్ దర్శకుడితో మరో సినిమా చేయనున్న ఎన్టీఆర్ !

Image
సూపర్ హిట్ దర్శకుడితో మరో సినిమా చేయనున్న ఎన్టీఆర్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రాన్ని చేస్తున్న తెలిసిందే. ఈరోజు తారక్ పుట్టినరోజు సందర్బంగా ఆ చిత్రం యొక్క ఫస్ట్ లుక్స్ ని నిన్న మధ్యాహ్నం రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్స్ కి అభిమానుల నుండి విశేష స్పందన దక్కింది. ఇకపోతే ఈ పుట్టినరోజు సందర్బంగా ఎన్టీఆర్ యొక్క 29వ ప్రాజెక్ట్ ఎవరితో అనేది కూడా అనౌన్స్ చేయబడింది. వరుసగా హ్యాట్రిక్ హిట్లందుకుని పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా మారిన కొరటాల శివ తారక్ యొక్క 29వ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ తన యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రానికి సిద్దమవుతుండగా ఎన్టీఆర్ సినిమాను 2018లో మొదలుపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది

NTR Birthday specials

Image
NTR Birthday specials హై వోల్టేజ్ యాక్షన్ కి పెట్టింది పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన కెరీర్ హైలైట్స్  రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన రెండో సినిమా ‘ స్టూడెంట్ నంబర్ 1’ .. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించి హీరోగా తారక్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో అనుకోని సందర్భంలో హంతకుడిగా మారి స్టూడెంట్ గా కొనసాగే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ఇరగదీశాడు. అప్పటి వరకూ హీరోగా మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్ ను ఒక్కసారిగా స్టార్ హీరో లిస్టులోకి చేర్చిన సినిమా ‘ఆది’ . గత సినిమాల్లో క్లాస్ లుక్ లో క్లాస్ నటనతో ఎంటర్టైన్ చేసిన యంగ్ టైగర్.. ఆదిలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ చూసి ఫీదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు . ఆది సినిమాతో హీరోగా అదరగొట్టేసిన ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమాతో అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులను చెల్లాచెదురు చేశాడు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెండో సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా అందులో ‘రాఖీ’ సినిమాకు ఓ ...

‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్ల వెనుక ఆంతర్యమేమిటి ?

Image
‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్ల వెనుక ఆంతర్యమేమిటి ? యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. మొదట సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల యొక్క లుక్స్ ను ఒకే పోస్టర్లో రిలీజ్ చేస్తారని అనుకోగా టీమ్ మాత్రం కేవలం ఒక పాత్ర లుక్ ను మాత్రమే బయటకు వదిలింది. దీంతో మూడు పాత్రల్లో ఇది ఏ పాత్ర లుక్ అయ్యుంటుందో అనే ఆలోచనలో పడ్డారు. పైగా పోస్టర్లో ఎన్టీఆర్ సంకెళ్లతో, వెనుక సింబాలిక్ గా రావణాసురుడి విగ్రహం ఉండటం చూస్తే ఈ పాత్రకు ఏమైనా నెగెటివ్ షేడ్స్ ఉంటాయా అనే థాట్ కూడా వస్తోంది. ఒక పాత్ర గెటపే ఇలా ఉంటే మిగతా రెండు పాత్రల గెటప్స్ ఎలా ఉంటాయో, ఎప్పుడు వస్తాయో అనే ఆతురత కూడా కలుగుతోంది. మొత్తం మీద ఎన్టీఆర్ తన మొదటి లుక్ తో అభిమానుల అంచనాల్ని చాలా వరకు అందుకున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రూ. 1500 కోట్ల మైలురాయిని చేరిన ‘బాహుబలి-2’

Image
రూ. 1500 కోట్ల మైలురాయిని చేరిన ‘బాహుబలి-2’  ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం మూడో వారం చివర్లో కూడా పూర్తి స్థాయి హవా చూపిస్తోంది. ప్రదర్శింపబడుతున్న అన్ని చోట్ల దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. మొదటి రెండు వారాల్లోనే ఇండియాలో రూ. 1020 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని ప్రస్తుతం మూడు వారాలు గడిచేసరికి రూ.1500 కోట్ల మైలురాయిని చేరింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇండియాలో రూ. 953 కోట్ల నెట్, రూ. 1,227 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్లో రూ. 275 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్లు రూ. 1,502 కోట్లకు చేరుకుంది. దీంతో వరల్డ్ వైడ్ కలెక్షన్లలో ఇండియా తరపున ఒక తెలుగు చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.